Begin typing your search above and press return to search.

టాప్ డైరెక్టర్ ఇగో హర్ట్ అయిందట

By:  Tupaki Desk   |   8 Sep 2016 5:30 PM GMT
టాప్ డైరెక్టర్ ఇగో హర్ట్ అయిందట
X
ఆయనో టాప్ మోస్ట్ డైరెక్టర్. రీసెంట్ టైం డెరెక్టర్లలో టాలీవుడ్ కి ఇండస్ట్రీ రికార్డులను పరిచయం చేసిన వ్యక్తి. ఈ దర్శకుడి నుంచి పిలుపు వచ్చిందంటే చాలు.. మాస్ హీరోగా పాతుకుపోవచ్చనే కాన్ఫిడెన్స్ హీరోలది. అందుకే ఆయన ఫోన్ కాల్ కోసం.. ఆయన ఇచ్చే ఆఫర్ కోసం చిన్నాచితకా హీరోలు ఎదురుచూసిన రోజులు గతంలో ఉన్నాయ్. కానీ ఇదంతా బాగా వెలిగిన గతం.

ఈ మధ్య ఈయన బాగా వెనకబడ్డాడు. లేక లేక కొట్టిన ఒక్క హిట్ క్రెడిట్ ని కూడా ఆ మూవీ హీరో పట్టుకెళ్లిపోయాడు. తర్వాత రెండు ఫ్లాపులు పడ్డంతో బౌన్స్ బ్యాక్ అయేందుకు స్టార్లతో కాకుండా.. నెక్ట్స్ లెవెల్ హీరోతో మూవీ చేస్తున్నాడు. అయితే.. ఈయన మేకింగ్ స్టైల్ ఓ రేంజ్ లో ఉంటుంది. స్టోరీ లైన్ తప్ప స్టార్ హీరోలకు కూడా మిగిలిన స్క్రిప్ట్ సంగతులు చెప్పే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వరుస ఫ్లాపుల దెబ్బకి.. ఏ స్టార్ హీరోని పలకరించినా.. ముందు పూర్తి స్క్రిప్ట్ తో రమ్మనే మాట వినిపిస్తోందిట.

సరే వీళ్లతో ఎందుకు? చిన్న హీరోలతో చేద్దామని అనుకుంటే వారు కూడా స్క్రిప్ట్ ఇస్తే చేస్తామనే డైలాగ్ చెప్పడంతో.. ఈయనకు ఇగో హర్ట్ అవుతోందని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఖాయం అయ్యాయనే టాక్ ఉంది కానీ.. వారి నుంచి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.