Begin typing your search above and press return to search.

పాఠ‌క లేఖ‌: జై భీమ్ సూర్య న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు

By:  Tupaki Desk   |   7 Nov 2021 2:30 AM GMT
పాఠ‌క లేఖ‌: జై భీమ్ సూర్య న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు
X
జైభీమ్ సినిమా చూశాక టాలీవుడ్ క్రిటిక్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. జై భీమ్ డోంట్ మిస్.. అంటూ తుపాకి స‌మీక్షించింది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో పాఠ‌కులు సైతం అద్భుత‌మైన స‌మీక్ష‌లు రాస్తున్నారు. అలాంటి స‌మీక్ష‌ల్లో ఒక‌టి మీకోసం..

అమెజాన్ ప్రైమ్ లో జై భీమ్ సినిమా చూశాక కచ్చితంగా ఈ సినిమా గురించి రాయలనిపించింది...మొదట సినిమా హీరో సూర్య కి అభినందనలు... ఇటీవల వరకు చేసిన ..పక్కా కమర్షియల్ ..హీరోయిజం ఎలివేట్ చేసే మూస పోసిన పైటింగ్ లు డ్యూయెట్ ల సినిమాల కు దూరంగా జరిగి అసలు గ్లామర్ వాసనే లేకుండా.. అసలు హీరోయిన్ లేకుండా.... గిరిజన యువతి కి న్యాయం చేసే సాధారణ లాయర్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా చూసినంత సేపు సూర్య కనపడడు...లాయర్ చంద్రు మాత్రమే కనపడ్తాడు. పోలీసుల అక్రమంగా నిర్బందించిన భర్తను విడిపించుకునేందు పోరాటం చేసే గిరిజన యువతి శెంగని గా కొత్త నటి లిజెమోల్ జోసె తనకు ఇచ్చిన పాత్రలో జీవించారు..ఒకరకంగా చెప్పాలంటే.. ఈ సినిమా కు మరో ప్లసు పాయింట్ పోలీసు ఐజి పెరుమాళ్ పాత్ర లో సహజ నటుడు ప్రకాష్ రాజ్ అదనపు ఆకర్షణ గా మారారు. అలాగే అడ్వకేట్ జనరల్ గా మరో నటుడు రావు రమేష్ పోటీ పడి నటించారు.

డైరెక్టర్ జ్ఞానవేల్ పెద్ద సాహసమే చేశారు ఈ కథను ఎంచుకుని... బ‌యోపిక్ ల‌లోనూ లవ్ ఫ్లేవర్ అద్ది ఇష్టానుసారంగా కమర్షియల్ చెత్త సినిమాలు వస్తున్న తరుణంలో... ..సామాన్యుల కు హెబియాస్ కార్పస్ పిటిషన్ ఉపయోగం..పోలీసులు తప్పుడు కేసులు పెట్టి హింసిస్తే ..పోరాడటానికి మన న్యాయ వ్యవస్థ లో ఉన్న అవకాశాలను... తెలిపే లా మంచి ప్రయత్నం చేశారు...ఈ వ్యవస్థలో ఇంకా అణగారిన వర్గాలు న్యాయం కోసం...పడే అగచాట్లను.. కళ్ల కు కట్టినట్లు గా చూపించారు. మాస్ మసాలాలు...చేతి రుమాలు అంత పిలికలు వేసుకుని హీరోయిన్లు చేసే వికారాలు.. వాళ్లతో అలా చేయించే డైరెక్టర్ల కు అలాంటి కమర్షియల్ ఫార్ములాల కు దూరంగా సినిమా తీయచ్చు..అనేందుకు ఈ సినిమా ఒక పెద్ద ఉదాహరణ. ...స్యూర అల్ ది బెస్ట్...ఇలాగే..భిన్నమైన నటన కొనసాగించాల‌ని కోరుకుంటూ..

గమనిక:
పాటలు.. ఫైట్స్.. చెవులు హోరెత్తించే బాక్ గ్రౌండ్ మ్యూజిక్.. బూతు డైలాగులు.. మాస్ మసాలాలు కావాలనుకునెవరు...దయచేసి ఈ సినిమా చూడద్దు. అలాంటివేమి జై భీమ్ లో వుండవు.

-నేతాజీ