Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి వరుస కట్టేశారుగా

By:  Tupaki Desk   |   24 Jan 2018 10:05 AM IST
ఇవాల్టి నుంచి వరుస కట్టేశారుగా
X
టాలీవుడ్ కి ఈ ఏడాది ఇప్పటివరకూ అంతగా కలిసి రాలేదు. కాకపోతే రాబోయే ప్రాజెక్టుల్లో మాత్రం బోలెడన్ని క్రేజీ పిక్చర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. సినిమాల మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేసిన మాదిరిగానే.. వీటి ప్రమోషన్స్ ను కూడా ఒక్కో రోజు గ్యాప్ ఇస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం మెయింటెయిన్ చేస్తున్నారు మన మూవీ మేకర్స్.

మొదటగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ టీజర్ తో ఈ హంగామా బిగిన్ కానుంది. ఇవాళ సాయంత్రం 4.15గం.లకు రంగస్థలం టీజర్ విడుదల కానుంది. వారం ముందు నుంచే రంగస్థలం టీజర్..ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో నిలుస్తుండడం గమనించాలి. 1980ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ మూవీ.. మార్చ్ 30న విడుదల కానుంది. రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రానికి థియేట్రికల్ ట్రైలర్ ను 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని.. ఫిబ్రవరిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య చిత్రం నుంచి ఓ దేశభక్తి పాటను.. 25వ తేదీన సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇక మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి.. ఓ కీలకమైన ప్రకటనను రిపబ్లిక్ డే రోజున ఇవ్వనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కూడా సమ్మర్ కే షెడ్యూల్ అయింది.