Begin typing your search above and press return to search.

#ఛాంబ‌ర్ లైబ్ర‌రీ ప్లాన్.. పుస్త‌కాల్ని సేక‌రిస్తే!

By:  Tupaki Desk   |   4 Dec 2021 10:00 PM IST
#ఛాంబ‌ర్ లైబ్ర‌రీ ప్లాన్.. పుస్త‌కాల్ని సేక‌రిస్తే!
X
వేటూరి సుంద‌ర రామమూర్తి.. వెన్నెల కంటి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ఇలా గొప్ప వారెంద‌రో అంత‌ర్థాన‌మ‌య్యారు. వీరి కంటే ముందే ఎంద‌రో సినీ గేయ ర‌చ‌యిత‌లు సాహితీకారులు కాలం చేశారు. కానీ వారు రాసిన సాహిత్యం ఎప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచే ఉంది. అయితే పాట గురించి.. లిరిక‌ల్ సాహిత్యం గురించి నేటి జ‌న‌రేష‌న్ కి మార్గ‌నిర్ధేశ‌నం చేసే పుస్త‌కాలు చాలా అరుదుగానే అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పాలి. వీటి కోసం స్పెష‌లైజేష‌న్ తో కూడుకున్న‌ లైబ్ర‌రీలు కూడా లేవు.

అయితే ఆ లోటును పూడ్చాలంటే దానికి ఎవ‌రో ఒక‌రు కృషి చేయాలి. ఆర్గ‌నైజేష‌న‌ల్ గా దానికి కృషి చేయ‌గ‌లిగితే ఇంకా ఎంతో బావుంటుంద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ప్ర‌ముఖ లిరిసిస్టులు సేక‌రించిన పుస్త‌కాలు.. సాహిత్యానికి సంబంధించిన పుస్త‌కాల‌తో ఒక చోట లైబ్ర‌రీని ఏర్పాటు చేస్తే దానిని భావిత‌రాలు అధ్య‌య‌నం చేసేందుకు విజ్ఞానానికి ఉప‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే వ్య‌క్తిగా కంటే ఫిలింఛాంబ‌ర్ లాంటి ఆర్గనైజేష‌న్ టాలీవుడ్ త‌ర‌పున‌ ఇలాంటి ఒక లైబ్ర‌రీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌స్తే ఎంతో బావుంటుంద‌నేది ప‌లువురి సూచ‌న‌.

మ‌న‌ద‌గ్గ‌ర ఉన్న‌ప్ర‌ముఖ లిరిసిస్టులు ర‌చ‌యిత‌ల‌కు పుస్త‌కాల సేక‌ర‌ణ ఒక హ్యాబిట్ గా ఉంది. గొప్ప సాహిత్యానికి సంబంధించిన పుస్త‌కాలు వారివ‌ద్ద అందుబాటులో ఉన్నాయి. వెట‌ర‌న్ లిరిస్టుల నుంచి సేక‌రించడం లేదా కొన‌డం ద్వారా కూడా ఒక లైబ్ర‌రీని అభివృద్ధి చేస్తే అది త‌రాల వారికి ఉప‌క‌రిస్తుంది.

కానీ అంత‌టి విశేష‌ కృషి చేసేంత పెద్ద మ‌న‌సు ఛాంబ‌ర్ పెద్ద‌ల‌కు ఉందా? అన్న‌ది ఇప్ప‌డు ప్ర‌శ్నార్థకం. కేవ‌లం సాహిత్యానికి సంబంధించిన పుస్త‌కాలే కాదు.. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ఉప‌క‌రించేలా న‌వ‌ల‌ల్ని.. గొప్ప గొప్ప ర‌చ‌న‌ల్ని కూడా లైబ్ర‌రీ కోసం సీనియ‌ర్ల నుంచి సేక‌రించాల్సి ఉంటుంది.

సీనియ‌ర్ సంభాష‌ణ‌ల ర‌చ‌యిత సత్యానంద్ వ‌ద్ద దాదాపు ఒక పెద్ద సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ లైబ్ర‌రీ లా అంత పెద్ద‌ లైబ్ర‌రీ (ఇందిరాన‌గ‌ర్ లో ఇల్లు అంతా లైబ్ర‌రీనే) ఉందంటే న‌మ్మ‌గ‌ల‌రా? అలాంటిది నేటిత‌రం ఔత్సాహిక ర‌చ‌యిత‌ల‌కు అందుబాటులో ఉంటే ర‌చ‌న ల ప‌రంగా ఎంతో గొప్ప‌ మ్యాజిక్ చేయ‌గ‌ల‌ర‌న్న‌ది నిస్సందేహం.

క‌థార‌చ‌యిత‌ల క్రియేటివిటీని నిర్ధేశించే పుస్త‌కాలు ఎన్నో వెట‌ర‌న్ రైట‌ర్ స‌త్యానంద్ వ‌ద్ద ఉన్నాయి. ఇత‌ర ర‌చ‌యిత‌ల వ‌ద్దా ఇలాంటి క‌లెక్ష‌న్ ఎంతో ఉంది. #ఛాంబ‌ర్ లైబ్ర‌రీ ప్లాన్ బావుంది. పుస్త‌కాల్ని సేక‌రిస్తే! మంచి ఆలోచ‌నే!! అన‌కుండా ఉండ‌గ‌ల‌రా?