Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సొంత చానెళ్ల‌తో వ‌ర్థ‌మాన తార‌ల రీల్ గేమ్

By:  Tupaki Desk   |   15 Oct 2020 10:30 AM IST
ట్రెండీ టాక్‌: సొంత చానెళ్ల‌తో వ‌ర్థ‌మాన తార‌ల రీల్ గేమ్
X
డిజిట‌ల్ వేదిక ప్ర‌తిభ‌కు ఆలంబ‌న‌గా మారింది. ఇక్క‌డ ఎవ‌రి ట్యాలెంట్ ఎంతో నిరూపించుకునే వెసులుబాటు క‌లిగింది. టీవీ రంగం స‌హా సినిమాల్లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌తీ ఒక్క‌రికి యూట్యూబ్ ఓ ప‌ర్ ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా మారింది. ఒక్క వీడియో హిట్ట‌యితే చాలు వాళ్ల‌ని సెల‌బ్రిటీల‌ని చేసేస్తోంది. అక్క‌డ ఓ రేంజ్ లో పాపుల‌ర్ అయిన వాళ్లలో చాలా మంది వెండితెర‌పైకి వ‌చ్చేస్తున్నారు. చాలా మందికి ఈజీగా సినిమాల్లోరి ఎంట్రీ ల‌భించేస్తోంది. అలా ఇప్ప‌టికే ఎంద‌రో గొప్ప ఉపాధిని పొందుతున్నారు.

దీంతో చాలా మంది కొత్త వాళ్లూ.. అప్ క‌మింగ్ ‌యాక్ట‌ర్స్ యూట్యూబ్ ని ప్ర‌ధానంగా ఎంచుకోవ‌డం.. సొంతంగా ఓ యూట్యూబ్ చాన‌ల్ ని క‌లిగి వుండ‌టం ప్ర‌స్తుతం ట్రెండ్ గా మారింది. చాలా మంది అప్ క‌మింగ్ స్టార్స్ సొంతంగా యూట్యూబ్ చాన‌ల్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో యాక్ట‌ర్స్ తో పాటు సింగ‌ర్స్‌, ...బిగ్ ‌బాస్ షో కంటెస్టెంట్ లు కూడా వున్నారు.

ప్ర‌స్తుతం ఇదే బాట‌లో శివ బాలీజీ, .... ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌,.... సింగ‌ర్స్ గీతా మాధురి,.... శ్ర‌వ‌ణ భార్గ‌వి.. ఇలా చాలా మంది సొంతంగా యూట్యూబ్ చాన‌ల్స్ ని స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే కొంత పేరు తెచ్చుకున్న వీరు యూట్యూబ్ చాన‌ల్స్ తో ఆడియ‌న్స్ కి మరింత‌గా ద‌గ్గ‌ర కావాల‌నుకుంటున్నార‌ట‌. ఇక యూట్యూబ్ తో గూగుల్ ప్ర‌క‌ట‌నల ఆదాయం రుచిమ‌రిగిన వారు ఈ వేదిక‌ను అస్స‌లు వ‌దిలి పెట్ట‌డం లేదు. అవ‌కాశాల‌కు అవ‌కాశాలు.. ఆదాయానికి ఆదాయం ప్లాన్ చేస్తున్నారంతే.