Begin typing your search above and press return to search.

తెలంగాణ గ్రామాల్లో టాలీవుడ్ జెండా

By:  Tupaki Desk   |   4 Nov 2015 8:32 AM GMT
తెలంగాణ గ్రామాల్లో టాలీవుడ్ జెండా
X
గ్రామాల దత్తత ఆదాయపు పన్ను మినహాయింపు కోసమే అని తేజ లాంటి వాళ్లు ఎద్దేవా చేసినప్పటికీ.. అలాంటి మాటల్ని పట్టించుకోకుండా టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా పల్లెటూళ్లను అడాప్ట్ చేసుకుంటుండటం గొప్ప విషయమే. ప్రధానంగా తెలంగాణలోని మారుమూల గ్రామాలపై టాలీవుడ్ సెలబ్రెటీల దృష్టిపడుతోంది. తెలంగాణ పంచాయితీ రాజ్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఒక్కొక్కరుగా తెలంగాణ పల్లెల వైపు కదులుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో దిగిపోయి.. దగ్గరుంచి పనులు చేపడుతున్నారు.

మరోవైపు మహేష్ బాబు ఆంధ్రాలోని ఓ గ్రామంతో పాటు తెలంగాణలోనూ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని.. త్వరలోనే పనులు మొదలుపెట్టబోతున్నాడు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ సైతం తెలంగాణలోని సుద్దుపల్లి అనే పల్లెను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాడు. ఈ గ్రామంలో మంచి నీరు - డ్రైనేజీ పనులు చేపట్టబోతున్నాడు సుమన్.

మరోవైపు ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ఫేమ్ ఆదిత్య ఓం సైతం ఓ తెలంగాణ గ్రామాన్ని దత్తత తీసుకోవడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ సెలబ్రెటీల పెద్ద మనసుతో తెలంగాణలోని కొన్ని గ్రామాల దశ తిరగబోతోందన్నమాట.