Begin typing your search above and press return to search.
కరోనా పై యుద్ధానికి వచ్చిన టాప్ కరోనా సాంగ్స్ ఇవే..!
By: Tupaki Desk | 12 April 2020 12:40 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రజలు 'కరోనా' అనే పేరు వింటేనే భయపడిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములు దగ్గులు వచ్చినా కూడా కరోనా సోకిందేమో అని కంగారు పడిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ఇళ్లకే పరిమితమైన జనాలు టీవీలు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి నెట్టింట్లో ట్రాఫిక్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలెబ్రెటీలు కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. పాటల రూపంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా పై ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనతో పాటు మన పక్కన ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని ఈ సాంగ్స్ ద్వారా వివరంగా తెలియజేసారు.
ఈ కరోనా అవేర్నెస్ సాంగ్స్ తో అందరికంటే ముందొచ్చింది చౌరస్తా అనే మ్యూజిక్ బ్యాండ్. 'చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా.. అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. తమ ఓన్ కంపొజిషన్ లో వచ్చిన ఈ పాట విడుదలైన కొన్ని రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాటకి ప్రస్తుతం సుమారుగా నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కరోనా పై ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటకు అనూహ్య స్పందన వచ్చింది. కోటి స్వరపరిచిన ఈ గీతంలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు నటించడంతో ఈ పాటకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కూడా పొందింది. 'ఫైట్ కరోనా..' అంటూ సాగే ఈ సాంగ్ కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూపొందించబడింది. ఈ సాంగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందర్నీ ముందుకొచ్చేలా చేసిందని చెప్పవచ్చు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై 'కనిపించని పురుగు' అంటూ తానే స్వయంగా ఒక సాంగ్ రాసి పాడి వినిపించాడు. చెవులకు మాస్కులు ధరించి వినమని సలహా ఇచ్చి అందరూ ఆ సాంగ్ వినేలా చేసాడు. ఈ పాటలో కరోనా వైరస్ ని ఒక పురుగు గా ట్రీట్ చేస్తూ అది చేస్తున్న విధ్వంసాన్ని ఫన్నీ వేలో చెప్పాడు. కరోనా భయంకర పరిస్థితులలో ఈ సాంగ్ అందర్నీ నవ్వించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తను మ్యూజిక్ అందించిన స్టూడెంట్ నెం.1 సినిమాలోని 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..' అనే సాంగ్ కి పేరడీగా కరోనా పై సాంగ్ పాడి అలరించాడు. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తనదైన శైలిలో 'ఎక్కడిది ఈ కరోనా' అంటూ పాట వినిపించాడు. ఈ పాటలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా భయపెట్టిందో చెప్తూ, దీనిని మనం ఎలా ఎదుర్కోవాలో సూచించాడు. ఈ పాటలో ఎస్పీబీ వాయిస్ వల్ల జనాలకు బాగా రీచ్ అయిందని చెప్పవచ్చు. వీరితో పాటు ఇంకా చాలా మంది కరోనా పై తమదైన శైలిలో అవేర్నెస్ కలిగిస్తున్నారు.