Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో డ్రగ్స్.. వీళ్ళేనా ఆ సెలబ్స్??

By:  Tupaki Desk   |   13 July 2017 3:48 PM GMT
టాలీవుడ్ లో డ్రగ్స్.. వీళ్ళేనా ఆ సెలబ్స్??
X
డ్రగ్ మాఫియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు.. ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అనేక మంది సెలబ్రిటీలు.. స్టార్లు ఇందులో ఇరుక్కున్నారనే వార్తలు హల్ చల్ చేస్తుండగా.. ఇప్పటికే పలువురికి తమ ముందు హాజరు కావాలంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసిందని అంటున్నారు. అయితే.. ఎవరికి నోటీసులు అందాయనే విషయంపై బయటకు చెప్పకపోయినా.. మీడియా దగ్గర మాత్రం పూర్తి వివరాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో.. డ్రగ్ మాఫియాలో ఇరుక్కున్న టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన జాబితాపై కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇందులో వారి పేర్లు వెల్లడించకపోయినా.. వారు ఎవరో గుర్తుపట్టేలా క్లూస్ మాత్రం ఇస్తున్నారు. త్వరగా సినిమాలు పూర్తి చేయడంలో దిట్ట అయిన ఓ టాప్ డైరెక్టర్.. గతంలో హీరోయిన్ అయినా ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్న హీరోయిన్.. హాట్ ఐటెం సాంగ్స్ కు ఫేమస్ అయిన ఓ నటి.. పబ్లిక్ ఫంక్షన్స్ లో హీరోలను విపరీతంగా పొగిడేసే ఓ టాప్ ప్రొడ్యూసర్.. ఓ గాయకుడు.. ఓ స్టంట్ మాస్టర్ తో పాటు పలువురు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు.

తెలుగు మీడియా దగ్గర మొత్తం జాబితా ఉన్నా.. పేర్లు బయటపెట్టద్దని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వారిని విచారించి అప్పుడు పోలీసులే ఈ వివరాలను చెబుతారట. అయితే.. మీడియా ప్రసారం చేస్తున్న కథనాల కారణంగా.. ఆయా స్టార్లు.. సెలబ్రిటీలు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారు.