Begin typing your search above and press return to search.

ఆగ‌కుండా సాగిన టాలీవుడ్ జైత్ర‌యాత్రకు బ్రేక్

By:  Tupaki Desk   |   7 March 2021 10:37 AM GMT
ఆగ‌కుండా సాగిన టాలీవుడ్ జైత్ర‌యాత్రకు బ్రేక్
X
తొమ్మిది నెల‌లుగా మ‌హ‌మ్మారీ క్రైసిస్ ని ఎదుర్కొని ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కుదుట‌ప‌డుతోంది. 2020 ఆద్యంతం ఎంత డెడ్లీగా ఉన్నా.. 2021 ఆరంభం ప‌రిశ్ర‌మ‌కు గొప్ప‌గా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో సైతం హోప్ ని పెంచేంత గొప్ప విజ‌యాలు టాలీవుడ్ అందుకుంది.

జ‌న‌వ‌రి ఆరంభం క్రాక్ విజ‌యం ఉత్సాహం నింపింది. ఆ త‌ర్వాత సంక్రాంతి సినిమాల‌తో జోష్ పెరిగింది. వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన ఇండ‌స్ట్రీ సెన్సేష‌నల్ హిట్ కొట్ట‌డంతో ట్రేడ్ లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది.

జ‌న‌వ‌రి నుంచి మొద‌లుపెడితే ఆగ‌కుండా సాగిన టాలీవుడ్ బాక్సాఫీస్ జైత్ర‌యాత్ర మార్చి 5న విడుద‌లైన సినిమాల‌తో కుదేలు అయిపోయింది. ఇందులో ఏ1 ఎక్స్ ప్రెస్- ప‌వ‌ర్ ప్లే వంటి సినిమాల‌తో జ‌నాలు ఎటెన్ష‌న్ తెచ్చుకున్నా కంటెంట్ విష‌యంలో వీక్ అయిపోవడం.. ఈ సినిమాల్లో న‌టించిన హీరోలు త‌మ ఛ‌రిష్మా పై ఆడియెన్స్ ని థియేట‌ర్ల‌‌కు ర‌ప్పించ‌లేని స్థితి ఉండ‌డంతో ముందు వారాల‌తో పోలీస్తే ఈ వారం బాక్సాఫీస్ క‌లెక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. మ‌రి వ‌చ్చే వారమైనా ఈ ప‌రిస్థితి మారి మ‌ళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వెళుతుందేమో చూడాలి.

చిన్న సినిమానే అయినా ఉప్పెన కంటెంట్ ఉన్న సినిమా కావ‌డంతో పెద్ద స‌క్సెసైంది. ఆ త‌రహాలో ఏదైనా వేవ్ మ‌ళ్లీ పుట్టుకొస్తుందేమో చూడాలి. స‌మ్మ‌ర్ లో ఎలానూ పెద్ద సినిమాలు రిలీజ‌వుతున్నాయి కాబ‌ట్టి ఈ నెల‌లోనే హుషారు పెంచాల్సి ఉంది.