Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బిగ్ స్టార్స్.. అమీర్ ఖాన్ స్పెషల్ షో

By:  Tupaki Desk   |   14 July 2022 12:02 PM GMT
టాలీవుడ్ బిగ్ స్టార్స్.. అమీర్ ఖాన్ స్పెషల్ షో
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అమీర్ ఖాన్ తో పాటు అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక తప్పకుండా సినిమా కూడా భారీ స్థాయిలో సక్సెస్ అవ్వాలి అని చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ప్రమోషన్స్ కూడా గట్టిగానే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రముఖుల కోసం లాల్ సింగ్ చద్దా స్పెషల్ షోను ప్రదర్శించడం విశేషం. రీసెంట్ గా హైదరాబాదుకు వచ్చిన అమీర్ ఖాన్ ప్రత్యేకంగా మెగాస్టార్ ను అలాగే నాగార్జునను కలుసుకొని లాల్ సింగ్ సినిమాను చూపించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖ హీరోలతో అలాగే అగ్ర దర్శకులతో కూడా చాలా సన్నిహితంగా మెదులుతున్న అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ఈ సినిమా స్పెషల్ షోను కూడా వారి కోసం ప్రదర్శించడం జరిగింది.

అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ స్పెషల్ షో కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున నాగచైతన్య అలాగే ప్రముఖ దర్శకులు రాజమౌళి సుకుమార్ కూడా స్పెషల్ షో లో పాల్గొన్నారు.

సినిమాలో అమీర్ ఖాన్ నటన మరొకసారి ఆశ్చర్యపరిచింది అని అద్భుతంగా ఉంది అని కూడా అగ్ర దర్శకులు మెగాస్టార్ కూడా ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అవుట్ ఫుట్ పై అమీర్ అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు.

తప్పకుండా సినిమా ఇండియా మొత్తంగా భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని అత్యధిక థియేటర్లలో కూడా విడుదల చేస్తున్నారు. ఇండియాలో మొత్తంగా మొదటిసారి అమీర్ ఖాన్ సినిమా అత్యధిక స్క్రీన్ లలో విడుదల కాబోతోంది. మరి సినిమా పెట్టిన పెట్టుబడికి ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.