Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న ఆంటీ డాన్స్..

By:  Tupaki Desk   |   13 April 2020 3:38 PM GMT
సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న ఆంటీ డాన్స్..
X
కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 21 రోజుల లాక్ డౌన్‌ని తాజాగా ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అయిపోయారు. నిత్యం షూటింగ్‌ల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపేసే న‌టీన‌టులంతా ఇంటి ప‌ట్టునే వుంటూ ఈ క్వారెంటైన్ టైమ్‌లో చిత్రాలు విచిత్రాలు చూపిస్తున్నారు. స్టార్ హీరోలంతా త‌మ ఫ్యామిలీతో క‌లిసి గ‌డిపేస్తున్నారు. తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ప్రగతి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న ఈమె క్వారెంటైన్ టైం లో తనలోని టాలెంట్ చూపిస్తుంది.

ఇంతకీ ప్రగతి ఆంటీ ఎం చేసింది అంటే.. తన ఇన్ స్టాగ్రామ్ లో దుమ్ముదులిపేసే డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టింది. సినిమాల్లో హోమ్లీగా కనిపించే ప్రగతి ఆంటీలో ఇంత మాస్ యాంగిల్ ఉందని ఎవరు ఊహించారు. డ్యాన్స్ చేయడం అంటే ఎదో అలా అలా కాలు కదపడం కాదు.. లుంగీ వేసి దుమ్ముదులిపేసింది. పక్కన తన కొడుకు కూడా ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. లుంగీ డ్యాన్స్ తో ప్రగతి చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇన్నాళ్లు సినిమాల్లో కేవలం ఇచ్చిన పాత్ర వరకు చేసి మెప్పించే ప్రగతి ఇక మీదట డ్యాన్స్ కూడా చేస్తుందా ఏంటని అంటున్నారు. ప్రగతి ఆంటీలోని ఈ టాలెంట్ ఏ దర్శకుడి దృష్టికైనా వెళ్తుందేమో చూడాలి.