Begin typing your search above and press return to search.
రింగుల జుత్తుతో మాయ చేసిన నవనాయికలు
By: Tupaki Desk | 15 May 2022 10:30 AM GMTరెగ్యులర్ హెయిర్ స్టైల్ తో పోలిస్తే రింగుల జుత్తుకు ఉన్న ప్రత్యేకతే వేరు. రింగుల జుత్తుతో మాయ చేసిన అరుదైన అందగత్తెలు సౌత్ లో కొందరు ఉన్నారు. అందులో టాప్ 10 ట్యాలెంటెడ్ బ్యూటీస్ ఎవరున్నారు? అన్నది ఆరా తీస్తే వివరాలు ఇలా ఉన్నాయి.
రింగుల జుత్తుతో మాయ చేయడమే గాక తనదైన ప్రతిభతో జూనియర్ సౌందర్యగా పిలుపందుకుంది నిత్యా మీనన్. సౌందర్య తరహాలోనే గొప్ప అభినయం ఉన్న నాయికగా తెలుగు వారి గుండెల్లో నిలిచింది. నిత్యామీనన్ ఇటీవలే అమ్మ జయలలిత బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలోనూ నటించింది. తదుపరి పలు చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది.
ప్రేమమ్ చిత్రంతో నిత్యాకు వారసురాలిగా బరిలోకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. తనదైన క్యూట్ లుక్ తో కుర్రకారు గుండెల్ని చిదిమేసిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా ఎలాంటి డోఖా లేకుండా ముందుకు సాగుతోంది. అ ఆ చిత్రంలో నాగవల్లి అనే పాత్రలో నటించిన అనుపమ కు తన ప్రతిభను నిరూపించుకునేంత పెద్ద స్థాయి పాత్రలు ఇంకా రాలేదనే చెప్పాలి.
నిత్యామీనన్ - అనుపమ తర్వాత మళ్లీ అంతటి ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక నాయిర్ కర్లీ హెయిర్ తో మ్యాజిక్ చేస్తుంది. యువతరంలో ఈ బ్యూటీకి చక్కని ఫాలోయింగ్ ఉంది. ఇక వీళ్లందరినీ మించి క్రేజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకెళుతున్న సాయి పల్లవి రింగుల జుత్తుతో తనదైన మాయాజాలం సృష్టించింది. నటిగా డ్యాన్సర్ గా సత్తా చాటిన సాయిపల్లవి సౌతిండియాలోనే బిజీయెస్ట్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఆసక్తికరంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తున్న వారే ఈ భామలంతా.
ముంబై టీవీ పరిశ్రమతో అనుబంధం ఉన్న అవికా గోర్ తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఈ భామ రింగుల జుత్తు సంథింగ్ స్పెషల్. తన స్మైల్ కి తగ్గట్టే రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఉత్తరాది బ్యూటీ రితికా సింగ్ హెయిర్ స్టైల్ కూడా కర్లీగా ఉంటుంది. ఇంతకుముందు రన్ రాజా రన్ - గాలి పటం లాంటి హిట్ చిత్రాల్లో నటించిన బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్ క్యూట్ అప్పియరెన్స్ తో రింగుల జుత్తుతో మాయ చేసింది. ఇక వైవియస్ చౌదరి రేయ్ అనే చిత్రంతో సయామీ ఖేర్ అనే టాప్ మోడల్ ని వెండితెరకు పరిచయం చేసారు. ఈ బ్యూటీ దురదృష్టం కొద్దీ తొలి ప్రయత్నమే ఫెయిల్యూర్ తో వెనుదిరిగింది. చాలా కాలానికి నాగార్జున వైల్డ్ డాగ్ లో నటించింది. సయామీ రింగుల జుత్తు నేరేడు పండు కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ భామలంతా రింగుల జుత్తుతో నేచురల్ బ్యూటీస్ గా కుర్రకారు గుండెల్లో నిలిచి ఉన్నారు. కెరీర్ పరంగా కొందరు ఉత్తమ స్థానంలో ఉన్నా పలువురు లక్ కలిసి రాక ఫెయిలయ్యారు.