Begin typing your search above and press return to search.
సినీ నటి హేమ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 17 July 2019 10:20 AM ISTరెండు మూడు దశాబ్ధాలుగా సినిమాల్లో నటిస్తున్న వారు కూడా ఆ రంగాన్ని నమ్ముకోకపోవడం వైచిత్యంగా మారింది. రంగుల ప్రపంచంలో బతుకు లేదని వారంతా నిర్ధారణకు వస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల వేళ సీనియర్ కమెడియన్ అలీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు. వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. టికెట్ వస్తే పోటీచేసేవారే.. కానీ సాధ్యపడలేదు.
ఇక మరో కమెడియన్ ఫృథ్వీ కూడా సినిమాల్లో అవకాశాలు లేక రాజకీయాల బాటపట్టారు. వైసీపీలో ప్రధాన కార్యదర్శి అయ్యి ఇప్పుడు నామినేటెడ్ పోస్టును కొట్టేశారు..
ఇప్పుడు వీరిద్దరి బాటలోనే సినీ నటి హేమ కూడా పయనిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ అందరు తారల వలే హేమ వైసీపీకి జైకొట్టారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన హేమ ఈ మేరకు తాను రాజమండ్రిలో కొత్త ఇల్లు కూడా కట్టుకుంటున్నాని.. పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
ఇన్నాళ్లు హైదరాబాద్ సినీ పరిశ్రమలో రాణించానని.. ఇక బాహ్య ప్రపంచంలోకి వచ్చి రాజకీయాల్లో కొనసాగుతానని హేమ స్పష్టం చేశారు. కాపుల కోసం బడ్జెట్ లో 2వేల కోట్లు కేటాయించిన జగన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.
సినీ నటి హేమ మొదట 2014కు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఓడిపోయి రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం విశేషం.