Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ అయ్యాక అడ్వాన్సులు లాక్కున్నారు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 11:30 PM GMT
యాక్సిడెంట్ అయ్యాక అడ్వాన్సులు లాక్కున్నారు!
X
`ఒక‌రికి ఒక‌రు` లాంటి క్లాసిక్ సినిమాలో న‌టించాడు హీరో శ్రీ‌రామ్. తెలుగు (తిరుప‌తి) వాడైనా కానీ త‌మిళంలో స్థిర‌ప‌డిన అత‌డు తెలుగులో అడ‌పాద‌డ‌పా న‌టిస్తూనే ఉన్నాడు. కొంత గ్యాప్ త‌ర‌వాత అత‌డు ఓ తెలుగు సినిమాలో న‌టించాడు. అవికా గోర్- శ్రీరామ్ ప్రధాన తారలుగా న‌టించిన `టెన్త్ క్లాస్ డైరీస్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అచ్యుత రామారావు .పి- రవితేజ మన్యం ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు గరుడవేగ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అయ్యాయి. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ప్ర‌చార వేదిక‌పై శ్రీ‌రామ్ త‌న గ‌తంలో చేదు అనుభ‌వం గురించి గుర్తు చేసుకున్నారు. క‌ష్టంలో ఉన్నా త‌న‌కు ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి గుంజుకున్న నిర్మాత‌ల గురించి చెప్పారు.

నా జీవితంలో `ఒకరికి ఒకరు` చాలా ఇంపార్టెంట్ మూమెంట్. నాకు యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులు బెడ్ మీద ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అడ్వాన్సులు తీసుకుని వెనక్కి వెళుతున్నారు. నేను హాస్పిటల్ లో ఉన్నాను. అప్పుడు రసూల్ ఎల్లోర్ వచ్చారు. ``నేను సినిమా తీస్తే నీతోనే తీస్తా. లేదంటే లేదు`` అని చెప్పి చాలా రోజులు వెయిట్ చేసి `ఒకరికి ఒకరు` తీశారు. తమిళంలో సినిమాటోగ్రాఫర్ కెవి ఆనంద్ దర్శకుడిగా పరిచయమైన సినిమాలో నటించా.

ఆ తర్వాత ఇంకో సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి తీసిన `టెన్త్ క్లాస్ డైరీస్`లో నటించాను. హ్యాపీగా ఉంది. అంజి గారిలో నేను స‌రైన‌ దర్శకుడిని చూశా. చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ విజువల్స్ మీద దృష్టి పెడతారు. స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు.

ఓ నిర్మాత చక్కగా కథ చెప్పడం నేను ఇంతకు ముందు చూడలేదు. మా నిర్మాత రామారావు గారు ఈ సినిమా కథ రాశారు. నాకు ఆయనే చక్కగా నేరేట్ చేశారు. నిర్మాణంలో రాజీ పడలేదు. బడ్జెట్ ఎక్కువైనా ఖర్చు పెట్టారు. ఇటువంటి నిర్మాత దొరకడం గాడ్ గిఫ్ట్. 96 -నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఫీల్ ఉన్న చిత్ర‌మిది`` అని తెలిపారు.

ఒకరికి ఒకరు తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌.. ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నా. ఇది నాకు పునర్జన్మ అనుకోవచ్చు అని శ్రీ‌రామ్ అన్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత శ్రీ‌రామ్ న‌టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి.