Begin typing your search above and press return to search.

సమ్మర్లో బన్నీ.. ప్రభాస్.. మహేష్‌?

By:  Tupaki Desk   |   7 Oct 2017 4:49 AM GMT
సమ్మర్లో బన్నీ.. ప్రభాస్.. మహేష్‌?
X
వేసవి ఎండలతో మండే కాలమే అయినా సినిమా ఇండస్ట్రీకి మాత్రం మంచి అనుకూలమైన సీజన్. పిల్లలకు సెలవులు కావడం.. కుటుంబాలు వెకేషన్ మూడ్ లో ఉండటంతో సినిమా హాళ్లు వీక్ డేస్ లో కూడా ఈజీగా హౌస్ ఫుల్ అవుతాయి. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను వీలైనంత వరకు సమ్మర్ టైంకి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సమ్మర్ మొత్తం బాహుబలి-2 కలెక్షన్లు కొల్లగొట్టింది. మరో సినిమా పోటీయే లేకుండా పోయింది.

2018 వేసవి నాటికి థియేటర్లకు తమ సినిమాలు తీసుకొచ్చేందుకు స్టార్ హీరోలు ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారు. ఈసారి సమ్మర్ బరిలో ముగ్గురు హీరోలు దిగుతున్నారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ ఏప్రిల్ 27న థియేటర్లకు వస్తుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో కూడా అప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. వీళ్లిద్దరికి తోడుగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించే భరత్ అనే నేను ముందుగా అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికే థియేటర్లకు రావాలి. కానీ ఈ సినిమా రిలీజ్ ను వేసవికి పోస్టు పోన్ చేస్తున్నారనేది టాలీవుడ్ లేటెస్ట్ టాక్.

ఈలెక్కన ముగ్గురు స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేటైంలో రిలీజ్ అవడమంటే కాంపిటీషన్ గట్టిగా ఉన్నట్టే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సినిమాకు రెండు - మూడు వారాలు గ్యాప్ ఉండేలా మేకర్లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దానివల్ల అనవసర పోటీ తగ్గి కలెక్షన్లు ఎక్కువ రాబట్టే అవకాశం ఉంటుంది.