Begin typing your search above and press return to search.

నేటి వారసులే.... రేపటి 'కధానాయకులా' ?

By:  Tupaki Desk   |   28 Feb 2019 6:04 AM GMT
నేటి వారసులే.... రేపటి కధానాయకులా ?
X
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం వ్యవహారం అనేది సర్వ సాధారణమే. ఇంకా చెప్పాలి అంటే, బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అక్కడ గుర్తింపు కూడా ఉంటుంది...అయితే గత కొంత కాలంగా ఈ విషయంలో చాలా మార్పే వచ్చింది. బడా బ్యాక్ గ్రౌండ్స్ ఏమీ లేకుండానే చాలా మంది టెక్నీషియన్స్ సినిమా ఫీల్డ్ లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో హీరోల విషయానికే వస్తే మన అలనాటి హీరోల నుంచి ఈనాటి హీరోల వరకూ అందరూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే. అయితే అందులో మెగాస్టార్ చిరుని కలపలేము, ఎందుకంటే 'స్వయంకృషి'కి ఆయన చిరునామాగా నిలుస్తారు. సరే ఇవన్నీ పక్కన పెడితే...ఇప్పుడున్న హీరోల వారసులే రేపటి తరానికి కాబోయే "కధా నాయకులా"? ఈ తరం ఇప్పుడున్న హీరోలను భుజాలు మీద మోస్తూ ఉన్నట్లే వచ్చే తరం ఈ హీరోల వారసులను తమ భుజాలపై మోయాలా? రేపటి తరం హీరోలు వీళ్ళేనా? అంటే అవును అనే అంటున్నాయి సినిమా వర్గాలు...

అసలు విషయంలోకి వెళితే, ప్రస్తుతం పవర్ స్టార్ హీరోగా రిటైర్ అవకుండానే, పొలిటికల్ గా బిజీ అయ్యాడు...ఇక ఆయన వారసుడుగా అకీరా నందన్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేశాడు...ఫ్యూచర్ పవర్ స్టార్ గా అకీరా ఖచ్చితంగా మారనున్నాడు అని తెలుస్తుంది...ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఈ ఏడాదే ఉంటుంది అని ఇప్పటికీ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పలు కారణాల చేత ఈ సినిమా లేట్ అవుతూ ఉంది...మరో పక్క మాస్ మహా రాజా రవి తేజ కుమారుడు ఇప్పటికే రాజా ధి గ్రేట్ లో నటించి అందరినీ మెప్పించాడు... "1 నేనొక్కడినే"లో మన ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు కూడా నటించి మా నాన్న నట వారసుడిని నేనే అంటూ ఇప్పటికే ఇండస్ట్రీకి సిగ్నల్స్ పంపాడు...

ఇక అల్లు అర్జున్ కొడుకు ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా ప్రోగ్రామ్ లో హల్‌ చల్ చేశాడు....ఎన్టీఆర్ కుమారుడు కూడా సోషియల్ మీడియాలో మోస్ట్ వైరల్ అయ్యే ఫోటోస్ లెక్కల్లో ఉన్నాడు....ఇక ప్రిన్స్ కుటుంభానికి చెందిన సుధీర్ బాబు కొడుకు కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట...ఇక సినిమా హీరోల కుమారులు అందరూ సినిమాపై చూపిస్తున్న ఆసక్తిని చూస్తూ ఉంటే, రేపటి తరానికి కాబోయే కధా నాయకలు అని స్పష్టంగా చెప్పవచ్చు. మరి వీళ్ళలో ఎవరు నిలబడతారో...ఎవరు తెరమరుగు అయిపోతారో తెలియాలి అంటే ఆ తరం తెరపైకి రావాల్సిందే.