Begin typing your search above and press return to search.

అమెరికా థియేట‌ర్ల‌లో పూన‌కాలు జ‌ర జాగర‌త‌!

By:  Tupaki Desk   |   14 Jan 2023 8:30 AM GMT
అమెరికా థియేట‌ర్ల‌లో పూన‌కాలు జ‌ర జాగర‌త‌!
X
మాస్ ఫ్యాన్స్ అల్ల‌రి ఆగ‌డాల‌కు స్వ‌దేశం విదేశం అనే తేడా లేదు. అన్నిచోట్లా మెగా నంద‌మూరి అభిమానులు మాస్ స్టైల్లోనే చెలరేగుతుంటారు. మొన్న అమెరికాలోని వీర‌సింహారెడ్డి థియేట‌ర్ వ‌ద్ద వీరంగం గురించి తెలిసిందే. షో ఆగిపోవ‌డానికి కార‌ణ‌మైంది ఈ ర‌భ‌స‌. అయితే తెలుగు రాష్ట్రాల్లో చెల‌రేగిన‌ట్టు ఇలా ఊరు కాని ఊళ్లో చెల‌రేగితే అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని మానసిక‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జాత్యాహంకార ధోర‌ణి పెచ్చు మీరిన అమెరికాలో గ‌న్ కల్చ‌ర్ గురించి తెలిసిందే. వారి కోపానికో లేక సైకోయిజానికి మ‌న తెలుగు సినిమా ఔత్సాహికులు టార్గెట్ అయితే ప‌రిస్థితేంటి? అన్న‌ది విశ్లేషిస్తే ఆందోళ‌న క‌లిగించ‌క మాన‌దు. ర‌చ్చ చేయాలి.. కానీ దానికో హ‌ద్దు ఉంటుంది. షోలు ఆగిపోయేంత ర‌చ్చ కూడ‌దు!

అమెరికా వెళ్లి అమెరిక‌న్ల ఉద్యోగాల‌ను లాక్కుంటున్న భార‌తీయులంటే అక్క‌సు మితిమీరి ఉంది. సైకోల్లా మారిన అమెరిక‌న్ యువ‌త గ‌న్ క‌ల్చ‌ర్ కి ఏమాత్రం వెన‌కాడ‌రు. ట్రిగ్గ‌ర్ నొక్క‌నంత వ‌ర‌కే.. బుల్లెట్ దిగ‌నంత వ‌ర‌కే! మ‌నోళ్ల‌లో జోష్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత నిజం ఏంటో తెలుసుకునే లోపే ఘోరం జ‌రిగిపోతుంద‌ని కొంద‌రు మాన‌సిక నిపుణులు మాస్ ఫ్యాన్స్ ని చాలా ముందే హెచ్చ‌రిస్తున్నారు.

అమెరికా థియేట‌ర్ లో షో వేయ‌కుండా ఆపివేయ‌డానికి భార‌తీయ మాస్ ఫ్యాన్స్ కార‌ణం. అలాంటి స‌మ‌యంలో అది ఎవ‌రైనా అమెరిక‌న్ కుర్రాడ‌కి న‌చ్చ‌క‌పోతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. గుంపులో గోవిందం గ‌న్ పేల్చితే ఏంటి ప‌రిస్థితి? కాబ‌ట్టి భార‌తీయులు ఎక్క‌డ ఉన్నా అదుపు త‌ప్ప‌కూడ‌దు. సంయ‌మ‌నంతో ఉండాలి. త‌మ ఆరాధ్య దైవం సినిమాలు బాగా ఆడాలి. ..ఆడించాలి... అదే స‌మ‌యంలో త‌మ‌ను తాము రక్షించుకునేలా హుందాత‌నంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అమెరికా నుంచి ఇండియాకు త‌మ బిడ్డ సంక్రాంతి పండ‌క్కి వ‌చ్చి త‌మ చుట్టూ సంద‌డి తెస్తాడ‌ని ఎదురు చూసే త‌ల్లిదండ్రులు తాత ముత్తాత‌లు కుటుంబీకుల‌ను కూడా కాస్తంత గుర్తు చేసుకోవాలి!

విదేశీయుల‌కు మ‌నం ఏలియ‌న్ త‌ర‌హా. అందువ‌ల్ల ఏలియ‌న్ల‌పై గురిపెట్టే స్థానికుల గురించి కొంత ఆలోచించి ఈ మాస్ ర‌చ్చ‌ను ఆపాలి. ఆప‌క‌పోతే త‌స్మాత్ జాగ్ర‌త్త‌!! ముఖ్యంగా అమెరికా థియేట‌ర్ల‌లో పూన‌కాలు జ‌ర జాగర‌త‌! అని కూడా నిపుణులు సూచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.