Begin typing your search above and press return to search.
టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత
By: Tupaki Desk | 17 Aug 2020 2:40 PM ISTతెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఉపాధ్యాక్షురాలిగా నటి జే పూజితను ఎంపిక చేస్తూ టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెంగాణ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీఎఫ్‌సీసీ అనుబంధ సంస్థగా ఉన్న టీమా ఉపాధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నాం. అప్పటి వరకు పూజితను తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లుగా ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా పూజిత మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఇతర సభ్యులు ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి నమ్మకంను నిలుపుకుని బాధ్యతగా పని చేసి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ టీమా సభ్యుల సమస్యలపై పోరాటం చేస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు.