Begin typing your search above and press return to search.

`కింగ్ ఆఫ్ ద క్రౌడ్` మాస్ మ‌హారాజా !

By:  Tupaki Desk   |   22 July 2022 2:38 PM GMT
`కింగ్ ఆఫ్ ద క్రౌడ్` మాస్ మ‌హారాజా !
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించినహై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ మూవీ ద్వారా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎస్ ఎల్ వీ సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ల‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ జూలై 29న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. `జై భీమ్` ఫేమ్ ర‌జీషా విజ‌య‌న్‌, `మ‌జిలీ` దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా న‌టించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. రీసెంట్ గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ మూవీపై అంచ‌నాల్ని పెంచేసింది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీలా కాకుండా బ‌ల‌మైన కంటెంట్ తో రూపొందిన ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్ టైన‌ర్ అని క్లారిటీ ఇచ్చేసింది.

థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లో దాదాపు మాస్ మ‌హారాజా త‌న విశ్వ‌రూపాన్ని చూపించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. `క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చిన ర‌వితేజ‌కు రీసెంట్ గా `ఖిలాడీ` మూవీతో స్పీడ్ బ్రేక‌ర్ త‌గిలింది.

ఎలాగైనా `రామారావు ఆన్ డ్యూటీ`తో మ‌ళ్లీ స‌క్సెస్ డ్యూటి ఎక్కూల‌ని ప‌ట్టుద‌ల‌తో వున్నార‌ట మాస్ మహారాజా ర‌వితేజ. అందుకే ఈ మూవీలో ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ అంటూ నిర్మాణంలో భాగ‌స్వామి అయ్యార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మూవీ ప్ర‌మోషన్స్ ని హోరెత్తించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ ని `కింగ్ ఆఫ్ ద క్రౌడ్` పేరుతో శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

సినిమాలో ర‌వితేజ పాత్ర‌ని, ఆ పాత్ర స్వ‌భావాన్ని తెలియ‌జేస్తూ సాగే పాట ఇది. మాస్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ వున్న ర‌వితేజ అభిమానుల‌ని అమితంగా ఆక‌ట్టుకునేలా ఈ పాట‌ని పిక్చ‌రైజ్ చేశారు. సినిమాలో ర‌వితేజ పాత్ర రెండు భిన్న పార్శాల్లో సాగే సంద‌ర్భాల‌ని చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. క‌ఠినంగా డ్యూటీ చేస్తున్న తీరు, అవ‌స‌రం అన్న వారికి అండ‌గా నిలుస్తున్న తీరుని చూపించారు. ఈ పాట‌కు సామ్ సీఎస్ ప‌ర్ఫెక్ట్ సింక్ అయిన సంగీతాన్ని అందించి మ‌రింత ఎలివేట్ అయ్యేలా చేశాడు.

ఈ పాట‌ని ల‌వితా లోబో ఆల‌పించారు. విశేషం ఏంటంటే పూర్తిగా మాంటేజ్ సాంగ్ గా సాగిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ సాహిత్యాన్ని అందించ‌డం. ప‌వ‌ర్ ఫుల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా ర‌వితేజ న‌టించిన ఈ చిత్రానికి స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీని, ఎడిటింగ్ కె.ఎల్‌. ప్ర‌వీణ్‌.