Begin typing your search above and press return to search.

తేజు తమ్ముడికి మంచి టైటిల్ దొరికిందే

By:  Tupaki Desk   |   6 May 2019 12:16 PM GMT
తేజు తమ్ముడికి మంచి టైటిల్ దొరికిందే
X
సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత వరస పరాజయాలతో కొంత ఇబ్బంది పడ్డ సాయి తేజ్ ఇటీవలే చిత్రలహరితో కొంత కోలుకున్నట్టే కనిపిస్తున్నాడు. అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చాలా వేగంగా దీని షూటింగ్ జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితం ఎవరో అభిమానులు జాలరి పేరుతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో పెట్టడంతో అందరూ అదే నిజం అనుకున్నారు. బ్యాక్ డ్రాప్ కు సింక్ అయ్యేలా పర్ఫెక్ట్ గా అనిపించడంతో అభిమానులు దాన్ని వైరల్ కూడా చేసేశారు. కాని తర్వాత నిజం కాదని తెలిసి ఊరుకున్నారు. ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం దీనికి టైటిల్ ఫిక్స్ అయ్యిందట

ఉప్పెన పేరుతో మైత్రి సంస్థ ఫిలిం చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించినట్టుగా సమాచారం. చేపలు పట్టే వారి నేపధ్యంలో కోస్టల్ ఏరియాలో సాగే ప్రేమ కథగా చాలా డిఫరెంట్ ఫీల్ తో ఇది సాగుతుందట. సముద్రపు అలల ఉప్పెన లాగా వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది అనే అర్థం వచ్చేలా ఇదే యాప్ట్ గా ఫీలవుతున్నట్టు సమాచారం.

ఉప్పెన పేరుతో పెద్దగా సినిమాలు వచ్చినట్టు లేవు. సౌండింగ్ కూడా పవర్ ఫుల్ గా ఉంది కాబట్టి కాన్సెప్ట్ పరంగా ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫస్ట్ లుక్ ని విడుదల చేసే సమయంలో ఇది ప్రకటించనున్నారు. ఈ ఏడాదే విడుదల కానున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే