Begin typing your search above and press return to search.

టైటిల్ ఎంపిక‌లో ఈ యంగ్ హీరో త‌ర్వాతే..!

By:  Tupaki Desk   |   7 Sep 2020 4:00 PM GMT
టైటిల్ ఎంపిక‌లో ఈ యంగ్ హీరో త‌ర్వాతే..!
X
టైటిల్ తోనే స‌గం హిట్టు కొట్టేయొచ్చు. అందుకే టైటిల్ విష‌య‌మై ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుంటారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. హీరోలు. బాగా ఆలోచించి టైటిల్ ని ఎంపిక చేస్తారు. అలాంటి ఓ టైటిల్ ని ద‌క్కించుకున్నాడు స‌త్య‌దేవ్. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం తిమ్మ‌రుసు. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ ఇద‌ని చెబుతున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మ‌హేశ్‌ కోనేరు- సృజన్ నిర్మిస్తున్నారు. క‌థానాయిక స‌హా ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

`ఉమామ‌హేశ్వ‌ర ఉగ్రరూప‌స్య` మూవీ ఓటీటీలో హిట్ట‌య్యింది. ఇలాంటి విల‌క్ష‌ణ‌మైన టైటిల్ ఎంపిక‌తో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్.. కంటెంట్ ప‌రంగానూ ఆ సినిమాని హిట్టు చేశాడు. ఇప్పుడు మ‌రోసారి మ‌రో మంచి టైటిల్ నే ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా క‌థాంశం ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది స‌స్పెన్స్. `తిమ్మరుసు -అసైన్ ‌మెంట్‌ వాలి` అంటూ ఉత్కంఠ పెంచారు.

త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా టైటిల్ లోగోని రిలీజ్ చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. బ్లఫ్‌ మాస్టర్ - ఉమామహేశ్వర ఉగ్రరూపస్య- తిమ్మ‌రుసు .. ఇవ‌న్నీ టైటిల్స్ బావున్నాయి. కంటెంట్ వైవిధ్యంతో.. గొప్ప పెర్ఫామెన్స్ ప్యాకేజీతో వ‌స్తే ఇలాంటివి గ‌మ్మ‌త్తుగా హిట్టెక్కుతుంటాయి. ఆ విష‌యాన్ని ఉమా మ‌హేశ్వ‌ర చిత్రం ప్రూవ్ చేసింది. అందుకే ఇప్పుడు తిమ్మ‌రుసుపైనా ఆస‌క్తి పెరిగింది.