Begin typing your search above and press return to search.

టిక్ టిక్ టిక్ తో వరుణ్ లింక్

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:11 AM GMT
టిక్ టిక్ టిక్ తో వరుణ్ లింక్
X
మనకు పెద్దగా పరిచయం లేదు కానీ తమిళ్ లో హీరో జయం రవికి క్రేజ్ బాగానే ఉంది. రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్ హీరో ఇతనే. అడపాదడపా హిట్లు కొడుతూ స్టార్ హీరో అనేంత రేంజ్ లేదు కానీ సక్సెస్ రేట్ మాత్రం బాగానే మైంటైన్ చేస్తూ రేస్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇతనివి గతంలో ఓ రెండు మూడు తెలుగులో డబ్ అయ్యాయి కానీ కనీసం వచ్చిన సంగతి ప్రేక్షకులు గుర్తించే లోపు థియేటర్ల నుంచి మాయం అయ్యాయి. ఇతని కొత్త సినిమా టిక్ టిక్ టిక్. స్పేస్ షిప్ నేపధ్యంలో చాలా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ జూన్ 22న విడుదల కానుంది. రీ మేక్ సాధ్యం కాదు కాబట్టి తెలుగు వెర్షన్ కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు వాయిదా పడ్డ దీని రిలీజ్ ఎట్టకేలకు ఫైనల్ అయ్యింది. కానీ దీని విడుదల నిర్మాణంలో ఉన్న వరుణ్ తేజ్ అంతరిక్షం(వర్కింగ్ టైటిల్)కు ఇబ్బందిగా మారిందని ఫిలిం నగర్ టాక్. కారణం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న ఆ మూవీ కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఒకవేళ టిక్ టిక్ టిక్ కనక హిట్ అయితే ఫ్యూచర్ లో వరుణ్ తేజ్ సినిమా చూసినప్పుడు దీనితో పోలుస్తారేమో అన్న అనుమానం. అందుకే విడుదల ఆపే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి అని టాక్.

కానీ తమిళ నిర్మాత పట్టుదలగా ఉండటంతో తెలుగు హక్కులు కొన్న నిర్మాతలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చడంతో ఫైనల్ గా టిక్ టిక్ టిక్ 22నే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ కాకూడదు. స్పేస్ షిప్ నేపధ్యంలో తీసే ఏ సినిమాకైనా బ్యాక్ డ్రాప్ ఒకేలా ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు గ్రావిటీ-ఇంటర్ స్టెల్లార్ లో ఇలాంటి నేపధ్యాన్ని చూడొచ్చు. స్టార్ వార్స్ సిరీస్ సంగతి సరేసరి. కథ విషయంలో ఎన్ని మ్యాజిక్కులు అయినా చేయొచ్చు కానీ సెటప్ మాత్రం ఒకేలా ఉంటుంది. తప్పదు. టిక్ టిక్ టిక్ అయినా కథ ఏముంటుంది అని చూసుకోకుండా ఒకే బ్యాక్ గ్రౌండ్ కాబట్టి వరుణ్ సినిమా కోసం ఆపుదాం అనే ఆలోచన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఆమాటకొస్తే పాతికేళ్ల క్రితం వచ్చిన ఆదిత్య 369లో కూడా ఓ పావు గంట సినిమా దీని పంధాలోనే సాగుతుంది. అలా అని వీటికి స్ఫూర్తి బాలయ్య సినిమా అనలేం కదా. కంటెంట్ డిఫరెంట్ గా ఉంటే ఒకే బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని గతంలో ఋజువయ్యింది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు . టిక్ టిక్ టిక్ లో మెంటల్ మదిలో ఫేమ్ నివేతా పేతురాజ్ హీరోయిన్. శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు.