Begin typing your search above and press return to search.
వీడియో: గాల్లో లేచి ముగ్గురిని ఒకేసారి మట్టి కరిపించే టైగర్
By: Tupaki Desk | 28 May 2021 9:00 AM ISTఇండియా లెవల్లో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ఉన్న స్టార్లను ఎంపిక చేస్తే బాలీవుడ్ లోనే నలుగురున్నారు. హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్.. విద్యుత్ జమ్వాల్ .. అక్షయ్ కుమార్ .. ఇలా నాలుగైదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులుగా తమను తాము తీర్చిదిద్దుకుని రకరకాల పతకాలు సాధించిన గొప్ప హీరోలు వీళ్లంతా.
నేటితరంలో ఎవరు బెస్ట్? అని ప్రశ్నిస్తే యాక్షన్ హీరో హృతిక్ అంతటివాడు తనతో పోటీపడగలిగేది ఒక్క టైగర్ ష్రాఫ్ మాత్రమేనని కితాబిచ్చేస్తారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో సిల్వస్టర్ స్టాలోన్ లా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ అతడి స్ఫూర్తితో ఎదుగుతున్న టైగర్ ఏ ఫీట్ వేసినా సంచలనమే. భాఘి సిరీస్ లో వార్ చిత్రంలో టైగర్ మార్షల్ ఆర్ట్స్ విద్యలు అబ్బుర పడని అభిమాని లేడు.
ఇక తన స్కిల్స్ ని అభిమానులే వీడియోల రూపంలో షేర్ చేసి పొగిడేసేంత గొప్ప ట్యాలెంట్ తన సొంతం. ఇక కిడ్స్ అయితే టైగర్ కి వీరాభిమానులుగా మారిపోతున్నారు. అతడి స్ఫూర్తితో ఎదగాలని తపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. తాజాగా టైగర్ గాల్లో ఎగిరి ముగ్గురు ప్రత్యర్థులని ఒకేసారి తన్నే వీడియో వైరల్ గా మారింది.

ఇవి రియల్ లైవ్ ఫీట్స్. అబ్బురపరిచేవి. వీటికి పిల్లలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. పెద్దలు విస్మయానికి గురవుతున్నారు. అతడికి అభిమానులుగా మారిపోతున్నారు. టైగర్ ని ఇండియన్ వెర్షన్ స్టాలోన్ గా ఆరాధిస్తున్నారు. ``మీరు కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పిల్లల హృదయాలను పెద్ద ఎత్తున గెలుచుకున్నారు. యాక్షన్- స్మైల్- రిలేటబిలిటీ- బిగ్ బ్రో ఫీల్ - ఇవన్నీ మిమ్మల్ని # హీరోపంథి సినిమాలో చూసినప్పటి నుండి # వార్ వచ్చే వరకు చూస్తూనే ఉన్నాం.. మీ బాల వీరాభిమానిని!! అంటూ హార్ట్ ఈమోజీల్ని కిడ్స్ షేర్ చేస్తుంటే అవి వైరల్ అవుతున్నాయి. టైగర్ ప్రస్తుతం పలు భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.