Begin typing your search above and press return to search.

మనోడు పులిని గొడుగుతో చంపాడు

By:  Tupaki Desk   |   3 Jun 2017 12:49 PM IST
మనోడు పులిని గొడుగుతో చంపాడు
X
తెలుగు వాడికి పొగరు అభిమానమే కాదు కూసంత సెమత్కారమూ ఉంటుంది. ఇది మన పెద్ద వంశీ గారి సినిమాల్లో గాట్టిగానే కనిపిస్తుంది. వంశీ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ నిన్నే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా గోదావరి పరిమళం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక జోక్ వైరల్ అవుతోంది.

మచ్చుకు ఇక్కడ ఒక జోక్ చూడండి. ఒక ముసలాయన కృష్ణ భగవాన్ దగ్గరకు వచ్చి.. ''ఒరే నాకు ఈ వయసులో పెళ్లి ఏంటి అన్నావు కాదు ఇప్పుడు చూడు మా ఆవిడకు రెండో నెల'' అన్నాడు. అప్పుడు నీకో కథ చెప్పాలి అంటూ కృష్ణ భగవాన్ ఇలా చెప్తాడు. ''నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి వేటకు వెళ్ళడం అలవాటు. ఒకసారి తొందరలో గన్ కి బదులు గొడుగు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడే అడవిలోకి ఒక పులి వచ్చింది.వాడు తెచ్చుకున్న గొడుగుతో కాల్చి చంపేశాడు'' అన్నాడు. అప్పుడు మసలాయన కాస్త చిరాకుగా.. ''గొడుగుతో పులి ని ఎలా చంపుతాడు, పక్కన ఉన్నవాడు ఎవడో గన్ తో చంపి ఉంటాడు'' అంటూ కౌంటర్ వేయడంతో.. అసలు ఈ జోక్ లోని ఆ డబుల్ మీనింగ్ అర్ధమైన ఆడియన్స్ భళ్ళుమని నవ్వేస్తున్నారు.

'ఫ్యాషన్ డిజైనర్' సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించగా వంశీ డైరెక్ట్ చేశారు. సుమంత్ అశ్విన్ హీరోగా అనిషా అంబ్రోస్ హీరోయిన్ గా నటించారు. మణి శర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/