Begin typing your search above and press return to search.

తన లవ్వర్ ను జనాలపై రుద్దుతాడట

By:  Tupaki Desk   |   9 Jun 2017 1:52 PM GMT
తన లవ్వర్ ను జనాలపై రుద్దుతాడట
X
ఒక హీరోయిన్లో ఎమేజింగ్ టాలెంట్ ఉంటే మాత్రం.. ఖచ్చితంగా బాలీవుడ్ లో అవకాశాలు చాలా చాలా ఫాస్టుగానే వచ్చేస్తాయి. అదే యాక్టింగ్ పరంగా పెద్దగా మ్యాటర్ లేకపోతే.. వారు స్టార్ కిడ్స్ అయినా కూడా బాగా వెయిటింగ్ లో ఉండాల్సిందే. ఇకపోతే కేవలం మోడలింగ్ సొగసలు మాత్రమే ఎక్కువగా ఉన్న దిశా పటాని వంటి భామల పరిస్థితి ఏంటి? గతంలో మోడలింగ్ నుండి వచ్చిన మలైకా అరోరా నుండి వలూశ్చా డిసౌజా వరకు.. అందరూ మహా అయితే ఐటెం సాంగుల్లో తమ డ్యాన్సింగ్ టాలెంట్ చూపిస్తున్నారేమోకాని.. పెద్ద హీరోయిన్లు మాత్రం కాలేకపోయారు. ఈ దిశ పరిస్థితి అంతకంటే స్పెషల్ గా ఏమీ లేదని చెప్పాలి.

కాకపోతే దిశా పటాని ఎప్పటినుండో హీరో టైగర్ ష్రాఫ్‌ తో ప్రేమాయణం సాగిస్తోంది. ఆ కారణంతో అమ్మడికి ఏదన్నా ప్లస్సయే ఛాన్సుంది. ఛాన్సుండటం కాదు.. స్వయంగా తనే దగ్గరుండి టైగరే ఈమెను ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఈమెకు యాక్టింగ్ పెద్దగా రాదని తేల్చేశారు క్రిటిక్స్ . అయినాకూడా తన సినిమా మేకర్లను కన్విన్స్ చేసి.. మనోడు ఆమెను బాఘీ సీక్వెల్ సినిమాలో హీరోయిన్ గా పెట్టించాడు. ఒకటే ఫేస్ ను పదేపదే జనాలపై రుద్దితే ఆటోమ్యాటిక్ గా వాళ్లు కాస్త పాపులర్ అయ్యే ఛాన్సుంది. ఆ విధంగా మరి దిశా పటాని ఈ సినిమాతో బాలీవుడ్ లో తను కూడా ఒక హీరోయినే అనిపించుకుంటుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/