Begin typing your search above and press return to search.

మరో స్టూడెంట్ దిగుతున్నాడండోయ్

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:17 PM IST
మరో స్టూడెంట్ దిగుతున్నాడండోయ్
X
2012 లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలుకొట్టిన సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2012లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సిద్దార్థ్ మల్హోత్రా - వరుణ్ ధావన్ తో పాటు హాట్ బ్యూటీ అలియా భట్ కూడా ఆ సినిమాతో తొలిసారి తెరంగేట్రం చేశారు. దర్శకరత్న కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని నిర్మిస్తూ తెరకెక్కించాడు.

అయితే ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ బొమ్మ పడనుంది. కానీ అందులో హీరోగా టైగర్ ష్రాఫ్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ లో ఇప్పుడిపుడే మంచి ఆదరణను దక్కించుకుంటున్న టైగర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ లో చాన్సు అందుకోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సారి కరణ్ జోహార్ దర్శకత్వ బాధ్యతలని తీసుకోలేదు. కేవలం నిర్మాతగానే వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను.. తరువాత దిశా పటానీని అనుకున్నారు కాని..ఎందుకో వారిద్దరినీ సైడ్ చేసేశారు. ఎవరన్నా కొత్తమ్మాయిని దించుతారట.

ఫాక్స్‌ స్టార్‌ కూడా సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక దర్శకత్వ బాధ్యతలను పునిత్‌ మల్హోత్రా తీసుకోనున్నాడు. రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో టైగర్ ష్రాఫ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహించి 2018లో సినిమాను స్టార్ట్ చేసునేందుకు కరణ్ సన్నాహకాలు చేస్తున్నారు.