Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ ఖల్‌ నాయక్‌ మళ్లీ..!

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:04 PM IST
సూపర్‌ హిట్‌ ఖల్‌ నాయక్‌ మళ్లీ..!
X
సంజయ్‌ దత్‌ నెగటివ్‌ షేడ్స్‌ లో నటించిన 'ఖల్‌ నాయక్‌' సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ దక్కించుకుంది. సంజయ్‌ దత్‌ ను ఆ సినిమాలో కొత్త యాంగిల్‌ లో చూపించడంలో మేకర్స్‌ సక్సెస్‌ అయ్యారు. 1993లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ కు రంగం సిద్దం అయ్యింది. సుభాష్‌ ఘాయ్‌ ఈ సీక్వెల్‌ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సీక్వెల్‌ లో బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌.. మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరో జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది.

ఖల్‌ నాయక్‌ సినిమాలో ముఖ్య పాత్రను జాకీ ష్రాఫ్‌ చేశాడు. ఇప్పుడు ఆయన తనయుడు సంజయ్‌ దత్‌ పాత్రను చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ కాంబోకు భారీ క్రేజ్‌ ఉంది. ఖల్‌ నాయక్‌ సినిమా ఎక్కడ అయితే ఆగిందో సీక్వెల్‌ అక్కడ నుండి మొదలు అవుతుందని అంటున్నారు. ఖల్‌ నాయక్‌ జైలు నుండి బయటకు రావడంతో సీక్వెల్‌ ప్రారంభం అవ్వనుందని అంటున్నారు. ఖల్‌ నాయక్‌ లో మాధురి దీక్షిత్‌ కీలక పాత్రలో కనిపించారు. మరి సీక్వెల్‌ లో హీరోయిన్‌ ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి.