Begin typing your search above and press return to search.

ఇంటిలిజెన్స్ కి దొరికిపోయిన హీరో హీరోయిన్స్!

By:  Tupaki Desk   |   1 Sep 2016 6:21 AM GMT
ఇంటిలిజెన్స్ కి దొరికిపోయిన హీరో హీరోయిన్స్!
X
లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన దిశాపటానీని చూసిన సినీ జనాలు బాగుంది, బాగా చేసింది అని చెప్పుకున్నా అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. ఇవ్వలేదా లేక బాలీవుడ్ లో వేరే వ్యాపకాల్లో ఉండి చేయలేదా అనే అనుమానాలు కలిగించేలా తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది మరేమిటో కాదు.. టైగర్ ష్రాఫ్ తో ఈ భామ నడుపుతున్న డేటింగ్ వ్యవహారం. ఈ విషయంలో ఇప్పటికే చాలామంది బాలీవుడ్ జంటలు దొరికిపోయినా, దొరక్కపోయినా.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ విషయాలను బహిరంగ పరుస్తూనే ఉన్నారు. కానీ.. ఈ జంటమాత్రం కాస్త సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆ సీక్రెట్ మనవారి ఇంటిలిజెన్స్ కు దొరికిపోయిందనుకోండి!!

టైగర్ ష్రాఫ్ - దిశాపటానిలపై ఇప్పటికే బాలీవుడ్ లో రకరకాల రూమర్స్ వస్తున్నా.. వీరుమాత్రం ఎక్కడా బయటపడిందీ లేదు, వాటిని ఖండించిందీ లేదు. దీంతో వీరి ప్రేమాయణం పై ఎవరికి వారు గాసిప్పులు రాసుకోవడమే తప్ప ఎక్కడా ఒక్క లీకుకూడా అధికారికంగా దొరికింది లేదు. అయితే తాజాగా తెలిసో తెలియకో ఇన్ స్టాగ్రం లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఈ విషయాలను చెప్పకనే చెబుతుంది.

ఈమధ్యకాలంలో ఒక రిసార్ట్ లో సేదతీరిన వీళ్లిద్దరూ అక్కడ దిగిన సింగిల్ ఫోజులుతో ఉన్న ఫోటోలను ఒకరి తెలియకుండా ఒకరు అప్ లోడ్ చేశారు. ఇంకా సీక్రెట్ మెయింటెన్ చేయాలని సింగిల్ ఫోజులు పోస్ట్ చేసినా కూడా మనవాళ్ల ఇంటిలిజెన్స్ తో గమనించి ఆ రెండు ఫోటోల బ్యాగ్రౌండ్స్ ని బట్టిచూస్తే ఇద్దరూ గడిపింది ఒకే రిసార్ట్ లో అని తేలింది. ఇంకేముంది.. వీరిద్దరి డేటింగ్ వ్యవహారంపై బాలీవుడ్ జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అనుకుంటాం కానీ.. ఇలాంటి విషయలు ఎంత కాలం దాయగలరు చెప్పండి. దాస్తే దాగే విషయాలా ఇవి!!