Begin typing your search above and press return to search.

సోమవారం ఆక్యుపెన్సీ 20 శాతమేనట

By:  Tupaki Desk   |   15 May 2019 12:18 PM GMT
సోమవారం ఆక్యుపెన్సీ 20 శాతమేనట
X
శుక్రవారం(మే 10 వ తేదీ) నాడు బాలీవుడ్ ఫిలిం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు హైప్ భారీగానే ఉంది. కరణ్ జోహార్ బ్యానర్లో తెరకేక్కడం.. సూపర్ హిట్ సినిమా అయిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కు సీక్వెల్ కావడంతో పాటుగా హీరో టైగర్ ష్రాఫ్ వరసగా 100 కోట్లు వసూలు చేసే సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

హీరో హీరోయిన్ల జిగేల్ మనిపించే దుస్తులు.. వాచ్ దగ్గర నుంచి షూ వరకూ అంతా బ్రాండ్స్ మయం చేయడంపై ఒక వైపు విమర్శలు వస్తూ ఉన్నప్పటికీ అది కూడా సినిమాకు ప్రమోషన్ అనుకున్నారు. ఈ హంగామా దెబ్బతో సినిమా ఓపెనింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి. మొదటి వారాంతంలో ఈ సినిమా 38 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఎలాంటి సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటాలంటే సోమవారం టెస్ట్ పాస్ అవడం ముఖ్యం. ఈ సినిమా మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. సోమవారం నాడు థియేటర్లలో ఆక్యుపెన్సీ 20 శాతానికి పడిపోయిందట. ఈ లెక్కన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ఫ్లాప్ దిశగా పయనించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కథ కథనాలపై పెద్దగా దృష్టి సారించకుండా జిగేల్ మనిపించే బ్రాండెడ్ బట్టలు.. టైగర్ జిమ్నాస్టిక్స్..తారా సుతారియా.. అనన్య పాండేల గ్లామర్ షోపై ఎక్కువగా ఆధారపడడంతోనే సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వెలువడుతోంది. అవన్నీ అదనపు హంగులే కానీ కథా కథనాలకు ప్రత్యామ్నాయం కాదన్న విషయం కరణ్ జోహార్ లాంటి సీనియర్ నిర్మాతకు తెలియకపోవడం ఏంటో.. అనే సెటైర్లు కూడా పడుతున్నాయి.