Begin typing your search above and press return to search.

టైగర్ ట్రబుల్ లో పడ్డాడు

By:  Tupaki Desk   |   8 April 2016 9:29 AM GMT
టైగర్ ట్రబుల్ లో పడ్డాడు
X
తెలుగు వర్షంను బాలీవుడ్ లో బాఘీ అంటూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ లు జంటగా నటించిన బాఘీ.. ఇప్పుడు సమస్యలో చిక్కుకుంది. అవడానికి వర్షం రీమేక్ అయినా.. దీన్ని హిందీలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా మార్చేశారు. అయితే.. ఈ మూవీలో ఉండే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను.. హాలీవుడ్ మూవీనుంచి కాపీ కొట్టేశారన్నది లేటెస్ట్ ఆరోపణ.

హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లిపోయి తన దగ్గర బంధించడంతోనే సినిమా స్టార్ట్ అవుతుందనే విషయం వర్షం లోనే చూశాం. మరి హీరోయిన్ ని విడిపించడం కోసం హీరో వచ్చి భారీ ఫైట్ చేస్తాడు. ఇదే సీన్ ని ఓ పెద్ద బిల్డింగ్ లో బంధిస్తే.. ఒక్కో ఫ్లోర్ లో ఉన్నవాళ్లను హీరో - హీరోయిన్ లు ఉతికి ఆరేస్తారనే విషయాన్ని బాఘీ ట్రైలర్ లోనే చూపించారు.

ది రెయిడ్: రిడెంప్షన్ అండ్ ది రెయిడ్2 అనే సినిమాలోని సీన్. ఈ మూవీకి ఇండియా రిలీజ్ - హిందీ రీమేక్ రైట్స్ తమ దగ్గర ఉన్నాయనని సిఖ్యా ఎంటర్టెయిన్మెంట్ అంటోంది. దీనిపై ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లిపోయి.. ఈ నెల 29న విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరింది. కాపీ కొట్టామనే విషయాన్ని నిర్మాత సాజిద్ నడియడ్వాలా ఖండిస్తున్నాడు. రిలీజ్ ముందు ఇలా అడ్డుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఈ మధ్య ఎక్కువయిపోయిందని కూడా ఆరోపించాడు సాజిద్.