Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికాలో సెక్సీ పులి

By:  Tupaki Desk   |   8 May 2017 4:55 PM IST
దక్షిణాఫ్రికాలో సెక్సీ పులి
X
అందం.. నటన రెండూ సమపాళ్లలో కలిసున్న సుందరి ప్రియాంక చోప్రా. బికినీలో హాట్ హాట్ గా ఫోజులిచ్చి ప్రేక్షకులను కట్టిపడేయంతోపాటు నిండైన చీరకట్టుతోనూ వావ్ అనిపించగలగడం ప్రియాంక స్పెషాలిటీ అనే చెప్పాలి. ఇటీవల బాలీవుడ్ లో తక్కువగా కనిపిస్తూ హాలీవుడ్ లో తళుక్కున్న మెరుస్తున్న ఈ మాజీ ప్రపంచ సుందరి నటనతోపాటు ఫ్యాషన్ లో తన స్టయిలే వేరని నిరూపించుకుంటోంది.

ఇటీవల మెట్ గాలా 2017 ఈవెంట్ లో పొడవాటి కోట్ తో అందరి చూపులు తనవైపే తిప్పుకున్న ప్రియాంక లేటెస్ట్ గా దక్షిణాఫ్రికాలో నిండైన చీరకట్టుతో ఆకట్టుకుంది. యునిసెప్ వారి ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో భాగంగా ఇటీవల ఆ దేశంలో పర్యటించింది., ఈ సమయంలో నల్లటి చీర, హ్యాండ్ పెయింటింగ్ తో వేసిన బెంగాల్ టైగర్ బొమ్మతో కూడిన బ్లౌజ్ తో చూపరులందరి దృష్టినీ ఆకర్షించింది. మనదయిన సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూనే దేశ జాతీయ జంతువయిన బెంగాల్ టైగర్ ను ప్రియాంక ప్రమోట్ చేసిన తీరు ఎంతో ఆకట్టుకుంది.

కెనడియన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ శృంగార సీన్లలో రెచ్చిపోయి మరీ నటించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ భామ తాజాగా హాలీవుడ్ లో రంగ ప్రవేశం చేయబోతోంది. ప్రియాంక నటించిన లేటెస్ట్ హాలీవుడ్ ఫిలిం ‘బేవాచ్’ మే 10న థియేటర్లలో విడుదల కానుంది. అమెరికన్ టీవీ సిరీస్ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ యాక్షన్ బేస్డ్ కామెడీ సినిమాలో కండల వీరుడు రాక్ (డ్వేన్ జాన్సన్) హీరోగా నటిస్తున్నాడు.