Begin typing your search above and press return to search.
టైర్ -2 హీరోలంతా యమా బిజీ!
By: Tupaki Desk | 2 Jun 2023 11:00 PMటైర్ వన్ స్టార్ హీరోలంతా ఏడాది కి ఒక సినిమా రిలీజ్ చేస్తుంటే? టైర్ -2 హీరోలంతా కనీసం రెండు..మూడు చిత్రాలతో నైనా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నాని.. నాగచైతన్య..వరుణ్ తేజ్..నిఖిల్ ..నితిన్.. సాయితేజ్ లాంటి యంగ్ హీరోలంతా! ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నారు. ఇటీవలే నాని 'దసరా'తో బ్లాక్ బస్టర్ అందుకుని రెట్టించిన ఉత్సాహంతో 30వ సినిమా ని సెట్స్ కి తీసుకెళ్లాడు. శౌర్యవ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నాని మరింత మంది కొత్త కుర్రాళ్లల ని లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.
సుకుమార్ శిష్యుల్ని ఒక్కొక్కరిగా లైన్ లోకి తెస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. 30వ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తదుపరి చిత్రాల లైనప్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. వాటిలో మూడు చిత్రాలు 2024 లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారుట. అలాగే మెగా వారసుడు వరుణ్ తేజ్ వేగంగానే సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' సినిమా చేస్తున్నాడు. ఇది వరుణ్ నుంచి వస్తోన్న మరో ప్రయోగంలో కనిపిస్తుంది. కమర్శియల్ సక్సెస్ దూరనమైనా వరుణ్ ప్రయోగాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
ఈ సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ అయ్యేది ప్రయోగాత్మక సినిమానే. వరుణ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయాని కొస్తే.. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో పైలెట్ పాత్రలో కనిపించనున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. ఇక పాన్ ఇండియా స్టార్ నిఖిల్ వేగం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
'ది ఇండియా హౌస్'..'స్వయంభు'..'కార్తికేయ-3' లాంటి సినిమాల తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా లో అతని ఇమేజ్ ని రెట్టింపు చేసుకునే ప్రత్యేక ప్రణాళికతో మార్కెట్లోకి వస్తున్నాడు. అలాగే 'విరూపాక్ష'తో కెరీర్ బండి ని పట్టాలెక్కించిన మెగా మేనల్లుడు సాయితేజ్ కూడా బిజీ అవుతున్నాడు. మామ పీకే తో కలిసి 'బ్రో 'లో నటిస్తున్నాడు.
అలాగే సోలోగా కొత్త ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా లైన్ లోకి తెస్తున్నాడు. కెరీర్ గ్యాప్ ని వీలైనంత వేగంగా పుల్ ఫిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా నాగ చైతన్య...విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సినిమాల నెంబర్ తో పాటు..సక్సెస్ కూడా పక్కాగా ఉండాలి అన్న ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. అంతా సెట్స్ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు.