Begin typing your search above and press return to search.
టిక్కెట్టు పెంపు నిర్మాతలకే నష్టమా?
By: Tupaki Desk | 9 May 2019 10:03 AM ISTసినిమాల టిక్కెట్టు ధర పెంచడం అన్నది నిర్మాతలకు కలిసొచ్చే అంశం కాదా? ఇది పరిశ్రమకు పెను ప్రమాదంగా పరిణమించనుందా? అంటే అవుననే పలువురు నిర్మాతలు.. ట్రేడ్ నిపుణులు.. క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. టిక్కెట్టు రేట్లు పెంచడానికి బడ్జెట్ల బూచీ చూపడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా టిక్కెట్టు రేట్లు పెంచడం అన్నది నిర్మాతల కంటే హీరోలకు మాత్రమే కలిసొస్తుంది. ఎగ్జిబిటర్ కి ఇది అస్సలు కలిసొచ్చే అంశం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టిక్కెట్టు ధర పెంచడం అన్నది ఆడియెన్ ని నిరాశపరచడమేనని ప్రముఖ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా టిక్కెట్టు ధర పెంచడం వల్ల ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి సినీపరిశ్రమ భవిష్యత్ ప్రమాదంలో పడే వీలుందన్న వాదనా వినిపిస్తున్నారు. థియేటర్లలో ఎక్కువ కాలం సినిమా ఆడే సన్నివేశం లేకపోవడానికి కారణం టిక్కెట్టు పెంపే. నిజానికి సినిమాని పబ్లిక్ వినోదం కోసం తీస్తున్నారా? లేక హీరోల్ని.. భారీ పారితోషికాలు అందుకునే వారిని పోషించేందుకు.. డిస్ట్రిబ్యూటర్లను పెద్ద వాళ్లను చేసేందుకు మాత్రమే ఇలా టిక్కెట్టు ధరల్ని పెంచేస్తున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే థియేటర్ యజమానులే టిక్కెట్టు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుందని.. కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చేసుకుని టిక్కెట్టు ను ఇష్టానుసారం పెంచేసుకుంటారా? అంటూ తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తమవుతోంది. మహర్షి లాంటి సినిమాని 130 కోట్ల బడ్జెట్ తో ఎందుకు తీయాలి? అయితే ముగ్గురు నిర్మాతలు కలిసి సినిమా తీసినా ఆ ముగ్గురికి రూ.10 కోట్ల చొప్పున డెఫిషిట్ ఎందుకు? ఇలా కష్టంలో ఎందుకు రిలీజ్ చేయాలి? ప్రేక్షకుడిపై భారం మోపి ఆ డబ్బు అంతా ఎటువైపు పోతోంది? అంటూ రకరకాల కోణాల్లో విశ్లేషణలు చేస్తుండడం ఆసక్తికరం. ప్రేక్షకుడి కోసం టిక్కెట్టు ధర తగ్గించాలి. ఇక తెలంగాణలో మహర్షి సినిమా టిక్కెట్టు పెంపుపై ప్రభుత్వం పోరాటం సాగించనుంది. తలసాని శ్రీనివాస యాదవ్ సైతం పెంచిన ధరల్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరికి వారు కోర్టు ఆర్డర్లు తెచ్చేసుకుంటారా? అంటూ ఒకటే సీరియస్ సన్నివేశం నెలకొంది. ప్రేక్షకుల ముక్కు పిండి డబ్బు వసూలు చేయడం సరైన విధానమా? అంటూ ప్రశ్నిస్తున్నారంతా. ఇక కోర్టుకు వెళితే పబ్లిక్ కి వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయంపై జడ్జీలు చీవాట్లు వేయడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళుతూ మంచి చేస్తోందని హర్షం వ్యక్తమైంది. ఇక పెద్ద సినిమాల కోసం టిక్కెట్టు పెంచడం వల్ల చిన్న సినిమాకు పెద్ద పంచ్ పడుతోందన్న వాదనా వినిపిస్తోంది. టిక్కెట్టు ధర పెంపు అన్నది డిజిటల్ వీక్షణ పెంచి థియేటర్లను నిర్వీర్యం చేస్తోందన్న వాదనా తాజాగా మరోసారి ఆసక్తికర డిబేట్ కి తెర తీసింది.