Begin typing your search above and press return to search.

పవన్‌ తర్వాతే బాలీవుడ్‌ నెం.1 హీరో

By:  Tupaki Desk   |   3 March 2020 5:38 AM GMT
పవన్‌ తర్వాతే బాలీవుడ్‌ నెం.1 హీరో
X
రెండు సంవత్సరాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ‘పింక్‌’ రీమేక్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ను సినిమా వారు పట్టించుకోవడం మానేస్తారేమో.. ఫ్యాన్స్‌ మర్చి పోతారేమో అనే అనుమానాలకు ఫుల్‌ స్టాప్‌ పడినది. నిన్న వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల సందర్బంగా సోషల్‌ మీడియాతో పాటు బయట ఫ్యాన్స్‌ చేసిన సందడి చూస్తుంటే పవన్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తెలిసి పోతుంది.

వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద పెద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు పాలాభిషేకాలు జరిగాయి. కొన్ని చోట్ల భరాత్‌ లు నిర్వహించి ఫ్యాన్స్‌ పండుగ చేస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌ అలా చేస్తే కొందరు మాస్‌ ఇంకా క్లాస్‌ ఆడియన్స్‌ సోషల్‌ మీడియా ను దద్దరిల్లేలా చేశారు. ముఖ్యంగా ట్విట్టర్‌ లో వకీల్‌ సాబ్‌ కుమ్మేశాడు. ఫస్ట్‌ లుక్‌ విడుదలైన కొన్ని నిమిషాలకే కొద్ది సేపు వరల్డ్‌ వైడ్‌ లో టాప్‌ లో ట్రెండ్‌ అయ్యింది.

ఇక నేషనల్‌ వైడ్‌ గా వకీల్‌ సాబ్‌ పెద్ద ఎత్తున ట్రెండ్‌ అవ్వడం జరిగింది. నిన్న బాలీవుడ్‌ నెం.1 హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన సూర్యవంశీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. దేశ వ్యాప్తంగా సూర్యవంశీ ట్రెండ్‌ అవుతున్న సమయంలో వకీల్‌ సాబ్‌ ను టాప్‌ లో పవన్‌ ఫ్యాన్స్‌ నిబెట్టారు. అది కూడా వరుసగా మూడు హ్యాష్‌ ట్యాగ్స్‌ ను పవన్‌ ఫ్యాన్స్‌ జాతీయ స్థాయిలో టాప్‌ లో ట్రెండ్‌ అయ్యేలా వేలు.. లక్షల్లో ట్వీట్స్‌ చేశారు. పవన్‌ స్టామినాతో ఇతర హీరోలు మరియు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా అవాక్కయ్యి ఉంటారంటూ ఫ్యాన్స్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా వకీల్‌ సాబ్‌ పోస్టర్‌ ను ట్వీట్‌ చేయడం జరిగింది.