Begin typing your search above and press return to search.

#త్రోబ్యాక్ 2019‌: బికినీ బీచ్ లో ఆద‌మ‌రిచి నిదురిస్తున్న పీసీ

By:  Tupaki Desk   |   21 March 2021 10:18 AM GMT
#త్రోబ్యాక్ 2019‌: బికినీ బీచ్ లో ఆద‌మ‌రిచి నిదురిస్తున్న పీసీ
X
ప్రియాంక చోప్రా ఇటీవ‌ల ఓప్రా విన్ ఫ్రే ఇంటర్వ్యూలో తన జీవితం గురించి ఎన్నో అనుభ‌వాల‌పై ఓపెనైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పీసీ ఎంతో రిలాక్స్ డ్ గా ఇలా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్న అద్భుతమైన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

బహామాస్ విహారయాత్రలో స్వేచ్ఛా విహారానికి సంబంధించిన‌ త్రోబాక్ ఫోటో ఇది. ``ఒక ద్వీపంలో ప‌డ‌వ‌లో కలలు కనేది # త్రోబ్యాక్ -2019`` అని క్యాప్షన్ ఇచ్చారు పీసీ. నిశ్శబ్ద బీచ్ ప‌రిస‌రాల్లో ఇలా బీన్ బ్యాగ్ పై విశ్రాంతి తీసుకుంటోంది. కాస్త ఆద‌మ‌రిచి అలా వాలిపోగానే.. ఆ ప‌రిస‌రాల్లో ఒక వ్యక్తి బహుశా భర్త నిక్ జోనాస్ స‌ర్ఫింగ్ పరికరాలను చెక్ చేస్తుండ‌డం క‌నిపిస్తోంది. ఈ ఫోటోకి అభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఈ స్వేచ్ఛ వేరొక‌రికి రాదు! అన్న వ్యాఖ్య‌లు వినిపించాయి.

2020 లో కరోనావైరస్ మహమ్మారి రంగ ప్ర‌వేశం చేయ‌క ముందు బికినీ బీచ్ లో సెల‌బ్రేష‌న్ ఇది. అనంత‌రం ప్రియాంక భర్త నిక్ జోనాస్ ‌తో కలిసి లాస్ ఏంజిల్స్ ఇంటిలో లాక్ డౌన్ సమయంలో నెలలు గడిపారు.
పీసీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రస్తుతం లండన్ లో తన తొలి వెబ్ షో సిటాడెల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించాల్సి ఉంది. ఇందులో మ్యాట్రిక్స్ 4 కూడా ఉంది.