Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ హిట్ మూవీ డైరెక్టర్ 3 ఏళ్ల గ్యాప్
By: Tupaki Desk | 30 March 2019 4:36 PM IST'రంగస్థలం' చిత్రంతో దర్శకుడు సుకుమార్ నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో రంగస్థలంను చేర్చిన దర్శకుడు సుకుమార్ ఆ వెంటనే మహేష్ బాబుతో సినిమాను అనుకున్నాడు. రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ మూవీ అనగానే ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆకాశంలో అంచనాలు పెట్టుకుని మరీ ఎదురు చూశారు. ఇక మహేష్ తో సుకుమార్ మూవీ అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఊరించి ఊరించి - అదుగో ఇదుగో అంటూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసి చివరకు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసినట్లుగా చెప్పారు.
మహేష్ బాబుకు కథ చెప్పడంకే సుకుమార్ ఎక్కువ సమయం తీసుకున్నాడు, ఆ సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో తర్వాత సినిమాకు మరింత సమయం పడుతుంది. ఇప్పటికే సుకుమార్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో అని క్లారిటీ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంను త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంది. అదే ఇంకా ప్రారంభం కాలేదు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల మూవీ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. త్రివిక్రమ్ మూవీని పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రంగా సుకుమార్ తో చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా వేణు శ్రీరామ్ కథకు బన్నీ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ తర్వాత వేణు శ్రీరామ్ తో మూవీ చేస్తే మాత్రం సుకుమార్ ఇంకా ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి రావచ్చు. గత ఏడాది ఆరంభంలో రంగస్థలం ను తీసుకు వచ్చిన సుకుమార్ గత ఏడాది అంతా ఖాళీగానే ఉన్నాడు, ఈ ఏడాది కూడా సినిమా మొదలు అయ్యే అవకాశం కనిపించడం లేదు. వచ్చే ఏడాది సినిమా ప్రారంభం అయితే 2021లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో. అంటే మొత్తంగా మూడు సంవత్సరాలు సుకుమార్ మూవీ లేనట్లే. అయితే సుకుమార్ దర్శకుడిగా సినిమాలు చేయకున్నా నిర్మాతగా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బ్యానర్ లో రెండు సినిమాల నిర్మాణం జరుగుతుంది.