Begin typing your search above and press return to search.

ఒకేసారి ముగ్గురు బ్రూస్‌ లీలు

By:  Tupaki Desk   |   1 Oct 2015 5:30 PM GMT
ఒకేసారి ముగ్గురు బ్రూస్‌ లీలు
X
ఒకేసారి ఒకే పేరుతో మూడు సినిమాలు తీసిన సంఘటన ఎప్పుడైనా జరిగిందా ? గతంలో ఒకే పేరు కోసం రెండు యూనిట్ల మధ్య కోర్టులెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాహుబలి మాదిరిగా ఒకే పేరుతో అనేక భాషల్లో ఒకే సినిమా రిలీజ్ కావడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు స్టోరీలు వేరు - యాక్టర్స్ వేరు - తీస్తున్న జోనర్స్ వేరు.. సినిమా పేరు మాత్రం ఒకటే కావడం విశేషం.

బ్రూస్ లీ టైటిల్ ఇలాంటి విచిత్రమైన సందర్భాన్ని తెరపైకి తెచ్చింది. బ్రూస్ లీ.. ది ఫైటర్ అంటూ రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 2న ఆడియో ఫంక్షన్ - 16న రిలీజ్ కాబోతోంది. ఇదో యాక్షన్ ఎంటర్ టెయినర్. అలాగే తమిళంలో ఇప్పటికే క్రైమ్ కామెడీ జోనర్ లో బ్రూస్ లీ పేరుతో ఓ మూవీ రెడీ అవుతోంది. దీని కోసం... మన చెర్రీ బ్రూస్ లీ తమిళ వెర్షన్ కి బ్రూస్ లీ-2 అని నామకరణం చేశారు.

ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా ఇదే టైటిల్ తో మూవీ తీస్తున్నాడు. నిజానికి ఇది రెండేళ్ల క్రితం మొదలుపెట్టి ఆగిపోయిన ప్రాజెక్ట్. రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ అంటూ ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశాడు. వర్మ ఎందుకిలా చేస్తున్నాడనే ప్రశ్నకు తనొక్కడే సమాధానం చెప్పగలడు. కానీ.. ఇలా ఒకే పేరుతో మూడు సినిమాలు రావడం మాత్రం ఇదే మొదటిసారి.