Begin typing your search above and press return to search.
ముగ్గురు లెజెండరీలు.. స్వర్గంలో సినిమా తీస్తే!
By: Tupaki Desk | 3 Feb 2023 6:00 PM ISTటాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది గొప్ప కళాకారులను ఇండస్ట్రీ కోల్పోతుంది. తాజాగా కళాతపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వగా... కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. అది కళాతపస్వి విశ్వనాథ్ తో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సిరివెన్నల సీతారామా శాస్త్రి కలిసి ఉన్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ముగ్గురు లెజండరీ వ్యక్తులు కలిసి ఉన్న ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ముగ్గురు స్వర్గంలో ఉంటే... కళాతపస్వి దర్శకత్వం వహిస్తూ.. సిరివెన్నల సీతారామ శాస్త్రి రాసిన లిరిక్స్ ను.. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాడుతారు... అని అనుకుంటున్నారు. ఇది ఊహ అయినప్పటికీ... స్వర్గంలో కూడా ఈ లెజెండరీ వ్యక్తులు సినిమా తీస్తే సూపర్ హిట్టే.
ఇక బాలసుబ్రణ్యం 2020లో సెప్టెంబర్ 25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఈయన సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసారు. కరోనా బారిన పడి.. ఆ తర్వాత 43 రోజులుగా మృత్యువుతో పోరాడి ఆఖరికి తుదిశ్వాస విడిచారు. ఇక తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి 2021 నవంబర్ 30న కన్నుమూశారు. దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో సిరివెన్నెల చిత్రానికి తొలిసారి సీతారామ శాస్త్రి కలాన్ని కదిలించిన విషయం తెలిసిందే.
కళాతపస్వీ కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నల సినిమాకు సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గానం అందించారు. ఈ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.
ఇక వీళ్ల కలయికలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఏది ఏమైనా ముగ్గురు లెజండరీ పర్సన్స్ ను ఇండస్ట్రీ కోల్పోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.