Begin typing your search above and press return to search.

బిబి4 ఫైనల్‌ కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు ముస్తాబు

By:  Tupaki Desk   |   16 Dec 2020 2:17 PM GMT
బిబి4 ఫైనల్‌ కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు ముస్తాబు
X
ఈ ఆదివారం బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం హౌస్‌ లో ఉన్న అయిదు మందిలో ఎవరు విజేత అవుతారు అనే ఆసక్తితో పాటు గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయంలో కూడా చర్చ జరుగుతోంది. గత సీజన్ లో చిరంజీవి వచ్చాడు. రాహుల్‌ సిప్లిగంజ్‌ కు చిరంజీవి చేతుల మీదుగా బిబి ట్రోఫీని నాగార్జున ఇప్పించాడు. ఈ సీజన్‌ విజేతకు ఎవరి చేతుల మీదుగా ట్రోఫీ అందబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్‌ అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆయన జెమిని టీవీతో ఒప్పందం చేసుకున్న కారణంగా ఈ షోకు రావడం అనుమానమే అనిపిస్తుంది.

ఇక గెస్ట్‌ విషయం పక్కన పెడితే ఆదివారం నాటి ఎపిసోడ్‌ లో డాన్స్‌ లతో అదరగొట్టేందుకు ముగ్గురు ముద్దుగుమ్మలు ఇప్పటికే రెడీ అవుతున్నారు. రాయ్‌ లక్ష్మి మరియు మెహ్రీన్‌ లతో పాటు మరో ముద్దుగుమ్మను కూడా ఫినాలే ఎపిసోడ్‌ లో డాన్స్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దసరా రోజు ప్రత్యేక ఎపిసోడ్‌ లో పాయల్‌ రాజ్‌ పూత్‌ డాన్స్‌ చేసింది. ఆమెను కూడా ఈ ఫినాలే ఎపిసోడ్ కు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కరు లేదా ఇద్దరు యంగ్‌ హీరోలు కూడా స్టేజ్‌ షో చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఫినాలే ఎపిసోడ్‌ ను కలర్‌ ఫుల్‌ గా హీట్‌ పెంచేందుకు ముద్దుగుమ్మలు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ అంతా కూడా ఫినాలే ఎపిసోడ్‌ లో కనిపించబోతున్నారు. వారు కూడా డాన్స్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.