Begin typing your search above and press return to search.

చిరు సరసన ఇంకో ఇద్దరెవరు?

By:  Tupaki Desk   |   28 Aug 2017 11:47 AM GMT
చిరు సరసన ఇంకో ఇద్దరెవరు?
X
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో కథానాయికగా నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో నయనతార ఒక్కరే హీరోయినా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాస్తవానికి ఉయ్యాలవాడ ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. ఆ ముగ్గురు భార్యల పేర్లు సిద్ధమ్మ.. పేరమ్మ.. ఓబులమ్మ. ఈ ముగ్గురిలో సిద్ధమ్మ పెద్ద భార్య. ఆమెకు దొర సుబ్బయ్య అనే కొడుకు కూడా ఉన్నాడు. బహుశా నయనతార ఈ పాత్రే చేస్తుండొచ్చని భావిస్తున్నారు.

మరి ఉయ్యాలవాడకు ఇంకో ఇద్దరు భార్యలున్న సంగతి కూడా సినిమాలో చూపిస్తారా.. లేక దాని మీద ఫోకస్ పెడితే.. అసలు కథ పక్కదోవ పడుతుందేమో అని ఆ ఇద్దరు భార్యల కథను కోసేస్తారా అన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో ప్రస్తుతం. ఇంకో ఇద్దరు భార్యలుండటం అన్నది గొప్ప విషయమేమీ కాదు కాబట్టి.. వాళ్లకు సంబంధించిన ఎపిసోడ్లను చూపించకపోతే.. చరిత్రను వక్రీకరించారంటూ పెద్దగా వివాదాలేమీ రాకపోవచ్చేమో. కాబట్టి నయనతార మాత్రమే సినిమాలో కథానాయికగా కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. చిరు సరసన ఒక హీరోయిన్‌ ను ఎంచుకోవడానికే చాలా కష్టమైంది. చాలా పేర్లను పరిశీలించి చివరికి నయనతారను ఫైనలైజ్ చేశారు. ఇంకో ఇద్దరమ్మాయిల్ని సెలక్ట్ చేయడం కూడా కష్టమే. మరి ‘సైరా..’ టీం ఏం చేస్తుందో చూడాలి. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.