Begin typing your search above and press return to search.

హీరోయిన్ ని ఫైనల్ చేసిన పూరీ?

By:  Tupaki Desk   |   26 March 2017 7:24 AM GMT
హీరోయిన్ ని ఫైనల్ చేసిన పూరీ?
X
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసేసుకుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసుకున్న ఈ చిత్రం.. మరో 10 రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఈలోగానే బాలయ్య పక్కన కనిపించే భామలను ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాధ్.

పూరీ-బాలయ్యల మూవీలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. ముగ్గురినీ కొత్తవాళ్లను తీసుకుందాని భావించారు దర్శకుడు. అయితే.. నిర్మాత అభ్యంతరం కారణంగా.. ఒక పాత్రకు మాత్రం స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నాడు. ఇప్పుడు మిగిలిన రెండు పాత్రలు కొత్తమ్మాయిలకు ఛాన్స్ దక్కనుండగా.. ఒక రోల్ కోసం అగ్రిమెంట్స్ కూడా పూర్తయిపోయాయట. ఛార్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పూరీ కనెక్ట్స్ నుంచే బాలయ్య హీరోయిన్ ను ఫైనల్ చేయడం విశేషం. మరోవైపు పలువురు స్టార్ హీరోయిన్లతో మాటా మంతీ జరుపుతున్న పూరీ.. మరి కొన్ని రోజుల్లోనే ముగ్గురు హీరోయిన్ల వివరాలను వెల్లడించబోతున్నాడట.

ఇక ఈ చిత్రంలో నటించేందుకు సన్నీలియోన్ ను కూడా ఒప్పించాడట పూరీ. ఆమెతో ఓ స్పెషల్ ఐటెం నంబర్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్.. ఇద్దరు కొత్త భామలు.. సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్.. బాలయ్య సినిమాలో గ్లామరసం తొణికసలాడ్డం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/