Begin typing your search above and press return to search.

వావ్.. బాలయ్య సినిమాలో ముగ్గురా?

By:  Tupaki Desk   |   23 Feb 2017 5:05 AM GMT
వావ్.. బాలయ్య సినిమాలో ముగ్గురా?
X
తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో 50 కోట్ల క్లబ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడ 101కి రెడీ అయిపోతున్నారు. కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో.. సి కళ్యాణ్ నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రంపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేయగా.. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్డేట్ తో.. నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరు వినిపిస్తున్నా.. మరోవైపు ప్రగ్రా జైస్వాల్ ను కూడా సంప్రదించనున్నారని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లకు స్కోప్ ఉంటుందిట. వీటిలో ఒక పాత్రను ప్రస్తుతం స్టార్ రేంజ్ లో ఉన్న ఒక భామను తీసుకోవాలని యోచిస్తున్నాడట దర్శకుడు కేఎస్ రవికుమార్.

ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య రొమాన్స్ చేయనున్నాడనే న్యూస్ కి తోడు.. మరోవైపు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఈ తమిళ దర్శకుడు చెప్పిన వెర్షన్ కి బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం.. ఈ స్టోరీలో బాలయ్య పాత్రను తీర్చిదిద్దిన విధానమే అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నారట కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/