Begin typing your search above and press return to search.
పవన్ సినిమాకు ముగ్గురు మాస్టర్లా?
By: Tupaki Desk | 17 April 2017 11:05 AM ISTపవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోతాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలో ప్రతిదీ హై రేంజిలో ఉండాలని ఆశిస్తారు ఫ్యాన్స్. అందుకేనేమో వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ల మీద ప్రత్యేక దృష్టిపెట్టినట్లున్నారు. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రముఖ స్టంట్ మాస్టర్ తో కంపోజ్ చేయిస్తుండటం విశేషం. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఒక యాక్షన్ ఎపిసోడ్ ను సీనియర్ స్టంట్ మాస్టర్ విజయన్ కంపోజ్ చేశాడు. ఆ ఫైట్ చిత్రీకరణ పూర్తయింది కూడా.
ఈ సినిమాలో మరో యాక్షన్ ఎపిసోడ్ ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ డిజైన్ చేస్తుండటం విశేషం. అతడింకా సెట్లోకి అడుగుపెట్టలేదు. ఈ లోపు సినిమాలోని ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కోసం మరో ఫైట్ మాస్టర్ వచ్చాడు. అతనే.. రవివర్మ. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రకరణ సందర్భంగా మధ్యలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రవి వర్మ. పవన్ సినిమాకు పని చేయడం చాలా సంతోషంగా ఉందని అతనన్నాడు. మరి సినిమాలో ఉన్నవి మూడు యాక్షన్ ఎపిసోడ్లేనా.. మరిన్ని ఉన్నాయా.. వాటికి వేరే యాక్షన్ కొరియోగ్రాఫర్లను పెట్టుకున్నారా అన్నది తెలియదు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన జల్సా.. అత్తారింటికి దారేది సినిమాల్లో ఫైట్లు అదిరిపోయాయి. వాటిని మించి కొత్త సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు ఉండాలని ఇలా ఒక్కోదాన్ని ఒక్కో స్టార్ ఫైట్ మాస్టర్ తో కొరియోగ్రాఫ్ చేయిస్తున్నట్లున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/