Begin typing your search above and press return to search.

2021 టాలీవుడ్ తొలి 3నెల‌ల్లో మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు

By:  Tupaki Desk   |   1 April 2021 4:00 PM IST
2021 టాలీవుడ్ తొలి 3నెల‌ల్లో మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు
X
2021 ఘ‌న‌మైన ఆరంభం `క్రాక్` మూవీతో సాధ్య‌మైంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన ఈ సినిమా 50శాతం ఆక్యుపెన్సీతో క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే సంక్రాంతి బ‌రిలో రిలీజైన ఇత‌ర సినిమాలేవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేదు. అనువాద చిత్రం మాస్ట‌ర్ తెలుగు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకోలేక‌పోయింది. క‌లెక్ష‌న్లు యావ‌రేజ్ అన్న టాక్ వినిపించింది. అయితే క‌రోనా భ‌యాల న‌డుమ కూడా సంక్రాంతి సినిమాల వీక్ష‌ణ‌‌కు జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం ఉత్సాహం పెంచింది.

మొదటి మూడు నెలల్లో 67 సినిమాలు విడుదలవ్వ‌గా రవి తేజ క్రాక్ సంవత్సరంలో మొదటి బ్లాక్ బస్టర్ గా నిల‌వ‌డం మేకర్స్ స‌హా బ‌య్య‌ర్ల‌ను సంతృప్తి ప‌రిచింది. అంచ‌నాల్ని మించి క్రాక్ ఆడింద‌న్న ట్రేడ్ రిపోర్ట్ తో త‌దుప‌రి రిలీజ్ ల‌కు వేగం పెరిగింది.

ఆ త‌ర్వాత రిలీజైన ఉప్పెన ఒక వేవ్. ఈ సినిమా రూ.50 కోట్ల మేర థియేట్రిక‌ల్ షేర్ వసూలు చేసింది. ఒక డెబ్యూ హీరోకి ఇది ఇండియా లెవ‌ల్లోనే రేర్ రికార్డు. మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ కి బెస్ట్ డెబ్యూగా నిలిచింది. కృతి శెట్టి కి ఘ‌న‌మైన ఆరంగేట్రం. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లోనూ ఉత్సాహం నింపింది.

మార్చిలో జాతి ర‌త్నాలు సెన్సేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఈ చిన్న మంచి చిత్రాన్ని కూడా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేశారు. కేవ‌లం రూ .4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ .40 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఈ చిత్రంలో నవీన్ పోలిషెట్టి- రాహుల్ రామకృష్ణ- ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రశాంత్ వర్మ `జాంబీ రెడ్డి` మంచి లాభాలను తెచ్చింది. అల్లరి నరేష్ న‌టించిన నాంది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి లాభాలను కూడా సంపాదించింది. రిలీజ్ తర్వాత నాన్-థియేట్రికల్ రీమేక్ హక్కుల ద్వారా మేకర్స్ మంచి లాభాలను ఆర్జించారు. యాంకర్ ప్రదీప్ 30 మంది రోజుల్లో స‌రైన టాక్ లేక‌పోయినా పెట్టుబ‌డుల్ని తిరిగి తేగ‌లిగింది. ఇక నితిన్ న‌టించిన రంగే దే చిత్రానికి క‌లెక్ష‌న్లు ఫ‌ర్వాలేద‌నిపించాయి. వారం వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ‌వుతున్నా 67 సినిమాలు రిలీజైనా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న‌వి మూడు. రెండు మూడు తిరిగి క‌లెక్ష‌న్ల వ‌ర‌కూ సాధించాయి అంతే. ఇత‌ర సినిమాలేవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. ఏప్రిల్ లో రిలీజ‌వుతున్న నాలుగైదు క్రేజీ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ వ‌స్తే రెండో క్వార్ట‌ర్ కి ఊపొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌హ‌మ్మారీ వ్యాక్సినేష‌న్ స‌హా ఇత‌ర స‌న్నివేశం క‌లిసొచ్చి సెకండ్ వేవ్ అంత‌మైతే అది టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు మంచి ఫ‌లితాల్ని ఇస్తుంద‌ని ఆశిస్తున్నారు.