Begin typing your search above and press return to search.

2022 సంక్రాంతికే కాదు స‌మ్మ‌ర్ కి వార్ ఫిక్స్

By:  Tupaki Desk   |   2 May 2021 10:30 AM GMT
2022 సంక్రాంతికే కాదు స‌మ్మ‌ర్ కి వార్ ఫిక్స్
X
2022 సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ - ప‌వ‌న్ మ‌ధ్య పోటీ ఉండ‌నుంద‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట‌.. ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రేసులో ఉన్నాయి. ఆ ఇద్ద‌రే కాక ప‌లువురు క్రేజీ హీరోలు వ‌చ్చే సంక్రాంతిపై క‌న్నేశార‌న్న టాక్ ఉంది. అప్ప‌టికి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్త‌వుతుంద‌న్న హింట్ కూడా ఉంది. కోవిడ్ పై నెమ్మ‌దిగా ప‌ట్టు సంపాదించ‌డం సాధ్య‌మ‌వుతుంది. కాబ‌ట్టి ఈసారి కాన్ఫిడెంట్ గా వ‌చ్చేయొచ్చ‌ని కొంద‌రు ఫిక్స‌వుతున్నారు.

అయితే ఈ భ‌రోసాతోనే 2022 స‌మ్మ‌ర్ పైనా మ‌రింత క్లారిటీ వ‌చ్చేస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తో సంబంధం లేకుండా వ‌చ్చే స‌మ్మ‌ర్ లో రిలీజ్ ల‌ను ఫిక్స్ చేసుకుంటున్నారు కొంద‌రు. వ‌చ్చే వేస‌విలో మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ .. ప్రభాస్ మధ్య ఆసక్తికర వార్ సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడోసారి ఓ చిత్రం కోసం పని చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా ఈ చిత్రం విడుదల అవుతుందని మేకర్స్ ధృవీకరించారు. రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ త్వరలో ప్రారంభమవుతుంది. ఎన్.టి.ఆర్ - కొరటాల శివ కాంబో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్ తరువాత ఎన్‌.టి.ఆర్ కొరటాల శివతో కలిసి పని చేస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎన్టీఆర్ యోచిస్తోంది. అధికారికంగా మొద‌లు పెట్టిన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇత‌రుల కంటే చాలా ముందున్నారు. ఆదిపురుష్ తో పాటు స‌లార్ చిత్రీక‌ర‌ణ‌తోనూ అత‌డు బిజీ. స‌లార్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ మూవీ వస్తుంద‌ని భావించినా సమ్మర్ బ‌రికి మారింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.