Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. సెన్సేష‌న్ కోస‌మా?

By:  Tupaki Desk   |   20 Feb 2021 2:29 PM IST
స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. సెన్సేష‌న్ కోస‌మా?
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బ‌యోగ్ర‌ఫీ `అన్ ఫినిష్డ్` అంత‌ర్జాతీయంగా ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విశ్వ‌ సుంద‌రిగా కిరీటం అందుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టే క్ర‌మంలో ఒక డెబ్యూ నాయిక‌గా తాను ఎన్ని వేధింపులు ఎదుర్కొందో ఈ పుస్త‌కంలో రాసుకొచ్చింది పీసీ. ఒకానొక సంద‌ర్భంలో త‌న డ్రెస్ ని విప్పాల్సిందిగా ఒక ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు కోరార‌ని కూడా వెల్ల‌డించింది.

అన్ ఫినిష్డ్ లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల పేర్లు బ‌హిరంగంగా వెల్ల‌డించ‌క‌పోయినా చాలామంది వ‌ల్ల తాను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొందో పూస‌గుచ్చి ప్ర‌తిదీ వెల్ల‌డించింది. దీంతో బాలీవుడ్ షేక‌వుతోంది.

అయితే మీటూ ఉద్య‌మం వేదిక‌గా కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత తెర‌పైకి వ‌చ్చిన‌ట్టు ఇంత‌కాలం పీసీ ఇలాంటి విష‌యాల్ని ఎందుక‌ని బ‌హిర్గ‌తం చేయ‌లేదు? అంటూ ప్ర‌శ్నించేవాళ్లు ఉన్నారు. ఇదంతా పుస్త‌కాలు అమ్ముకోవడానికే అని విమ‌ర్శించేవాళ్లున్నారు. దానికి కార‌ణాన్ని కూడా పీసీ ఓ చానెల్ ఇంట‌ర్వ్యూ‌లో బ‌హిర్గ‌తం చేసింది. ``చాలా కాలం అంత‌ర్గ‌త భ‌యాలు న‌న్ను వెంటాడాయి. అభ‌ద్ర‌తాభావం వ‌ల్ల‌నే చెప్ప‌లేక‌పోయాను`` అని ఆ ఇంట‌ర్వ్యూలో ప్రియాంక చోప్రా వెల్ల‌డించారు.

దీనిని బ‌ట్టి త‌న‌కు పెద్ద వాళ్ల నుంచి బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ని కెరీర్ ప‌రంగా అభ‌ద్ర‌త ఉంద‌ని ఊహిస్తున్నారు. అన్న‌ట్టు బాలీవుడ్ మాఫియాపై కంగ‌న చెబుతున్నవ‌న్నీ నిజాలే అనేందుకు పీసీ పుస్త‌కం అన్ ఫినిష్డ్ ఊతం ఇస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. అన్ ఫినిష్డ్ పుస్త‌కం 2021 బెస్ట్ సెల్ల‌ర్ గా న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రం.