Begin typing your search above and press return to search.

ల‌వ్ చేయ‌క‌పోతే చ‌నిపోతా.. సినీ న‌టికి బెదిరింపులు!

By:  Tupaki Desk   |   28 May 2021 9:00 AM IST
ల‌వ్ చేయ‌క‌పోతే చ‌నిపోతా.. సినీ న‌టికి బెదిరింపులు!
X
సినిమా హీరోయిన్లు అంటే చాలా మందికి క్ర‌ష్ ఉంటుంది. అది సాధార‌ణ‌మే. కొంత మంది వ‌న్ సైడ్ టైప్ ప్యార్ కూడా కొంత కాలం కంటిన్యూ చేస్తారు. ఇలాంటి వారు కూడా అరుదుగా క‌నిపిస్తారు. కానీ.. తాను ప్రేమిస్తున్నాన‌ని న‌టికి ప్ర‌పోజ్ చేయ‌డ‌మే కాకుండా.. త‌న‌ను ల‌వ్ చేయ‌క‌పోతే చ‌నిపోతాన‌ని బెదిరించాడో వ్య‌క్తి! ఇంత‌కీ ఆ న‌టి ఎవ‌రు? ఆమెకు ఎదురైన అనుభ‌వ‌మేంటీ అన్న‌ది చూద్దాం.

ఆ న‌టి పేరు అనికా సురేంద్ర‌న్‌. 'విశ్వాసం' చిత్రంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కూతురిగా నటించిందీ బ్యూటీ. ఈ సినిమాలో అనికా న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో.. త‌మిళ‌నాట ఫేమ‌స్ అయిపోయిందీ అమ్మ‌డు.

అయితే.. లేటెస్ట్ గా ఈ చిన్న‌ది సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ ఓ ప్ర‌శ్న వేశాడు. ''నీ వీరాభిమాని ఎవరైనా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేసి, మీరు పెళ్లికి ఒప్పుకోక‌పోతే చనిపోతా అని బెదిరిస్తే మీరేం చేస్తారు?'' అని అడిగాడు.

ఈ ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రూ ఊహించ‌ని స‌మాధానం ఇచ్చింది అనికా సురేంద్ర‌న్. ఆల్రెడీ ఇలాంటి ఘ‌ట‌న త‌న జీవితంలో జ‌రిగింద‌ని చెప్పింది. ఈ మేర‌కు ఓ అభిమాని మెయిల్ చేశాడ‌ట‌. ఆ మెయిల్ లో త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని, అంగీక‌రించ‌క‌పోతే ప్రాణాలు తీసుకుంటాన‌ని బెదిరించాడ‌ట‌. ఇది చ‌దివిన త‌ర్వాత తాను తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాన‌ని చెప్పింది అనికా.

కొన్ని రోజులు ఈ విష‌య‌మై ఆలోచించిన‌ట్టు చెప్పింది. అయితే.. ఆ త‌ర్వాత అలాంటి ఘ‌ట‌న ఏదీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో తాను ఊపిరి పీల్చుకున్నాని తెలిపింది అనికా. ఇదిలాఉంటే.. హీరోయిన్ గా ప్ర‌మోట్ అయ్యిందీ బ్యూటీ. త్వ‌ర‌లోనే ఓ మ‌ల‌యాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.