Begin typing your search above and press return to search.

బ్లేడ్ గణేష్ కే కత్తెర వేసేందుకు రెడీ!

By:  Tupaki Desk   |   19 Jan 2020 11:45 AM IST
బ్లేడ్ గణేష్ కే కత్తెర వేసేందుకు రెడీ!
X
సినిమా తీసే సమయంలో అన్నీ నచ్చుతాయనే దర్శకులు అనుకుంటారు కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలోని అన్ని అంశాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. సాధారణంగా ప్రతి సినిమాకు ఏదో ఒక అంశంలో ఇలా జరుగుతుంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లో ట్రెయిన్ ఎపిసోడ్ కామెడీ గురించి గొప్పగా చెప్పుకున్నారు కానీ అది స్క్రీన్ పై అంతగా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా బండ్ల గణేష్ సన్నివేశాలకు పెద్దగా స్పందన దక్కలేదు. ఫోర్స్డ్ గా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బండ్ల గణేష్ కొంతకాలం గ్యాప్ తర్వాత కామెడీ చేస్తుండడంతో నవ్వులు పూయిస్తాడని థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అనుకుంటే.. ఆ అన్నివేశాలు పెద్దగా పేలలేదు. సినిమాకు ప్లస్ కాకపోగా ఫ్లోకు అడ్డుపడుతున్నాయని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సంగతి మహేష్.. అనిల్ రావిపూడికి కూడా తెలిసిందని.. దీంతో ఇద్దరూ చర్చించి బ్లేడ్ గణేష్ సీన్స్ కట్ చెయ్యాలని నిర్ణయించారని సమాచారం. ఈ సోమవారం నుంచి బ్లేడ్ గణేష్ సీన్స్ ఉండవని అంటున్నారు.

'సరిలేరు నీకెవ్వరు' సినిమా నిడివి ఎక్కువేమీ లేదు కానీ అనవసరమైన సీన్లు కట్ చేస్తే సినిమా క్రిస్పీగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ నుంచి అధికారికంగా ధృవీకరణ రావాల్సి ఉంది. రీఎంట్రీ తో ప్రేక్షకులను కితకితలు పెడతాడు అనుకుంటే బండ్ల భయ్యా ఇలా ఉసూరుమనిపించాడు ఏంటో!