Begin typing your search above and press return to search.
ఊపిరి తమిళ ట్రైలర్ తేడాగా ఉందే..
By: Tupaki Desk | 12 March 2016 7:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు కార్తి బాగానే పరిచయం. అతడికంటూ ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ నాగార్జున తమిళంలో అంత పాపులరేమీ కాదు. అందుకే ‘ఊపిరి’ తమిళ వెర్షన్ విషయంలో నాగార్జునను అంతగా హైలైట్ చేయడానికి నిర్మాత పీవీపీ ఇష్టపడుతున్నట్లు లేదు. ఆల్రెడీ ఊపిరి తమిళ వెర్షన్ ‘తొళ’ ప్రమోషన్లకు నాగార్జునను దూరం పెడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీనికి తోడు థియేట్రికల్ ట్రైలర్ విషయంలోనూ నాగ్‌కు ప్రయారిటీ బాగా తగ్గించేశారు. ఇంతకుముందు టీజర్ విషయంలో రెండు చోట్లా ఒకేలా ఉండేలా చూసుకున్నారు కానీ.. ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి నాగ్‌కు ప్రయారిటీ తగ్గించేసి.. కార్తినే హైలైట్ చేశారు. అసలీ సినిమాలో కార్తినే హీరో.. నాగ్‌ది గెస్ట్ రోల్ అన్నట్లుగా ఉంది ఆ ట్రైలర్.
తెలుగులో ముందు నాగార్జున పాత్రతో ట్రైలర్ మొదలవుతుంది. కానీ తమిళంలో మాత్రం ముందు కార్తి కనిపిస్తాయి. ఆ తర్వాత కూడా మెజారిటీ పార్ట్ కార్తినే కనిపిస్తాడు. నాగార్జున మొత్తంగా ఓ అర నిమిషం కనిపిస్తే ఎక్కువ అన్నట్లుగా ఉంది. తెలుగులో ఉన్న నాగ్ డైలాగులు చాలా వరకు లేపేశారు. కార్తివి మాత్రం అదనంగా కలిపారు. తెలుగులో ప్రకాష్ రాజ్ ఒక చిన్న డైలాగ్ మాత్రమే చెప్పగా.. తమిళంలో ఆయనకు సంబంధించిన షాట్స్ కూడా కొన్ని చూపించారు. ట్రైలర్ ముగించే సమయంలో కూడా ఫోకస్ అంతా కార్తి, తమన్నాల మీదే ఉంది. ఈఫిల్ టవర్ ముందు తమన్నా నిలబడితే.. కార్తి కిందికి వంగి వంగి ఫొటో తీసే ఫన్నీ సీన్‌తో ట్రైలర్ ముగించారు. తెలుగు ట్రైలర్ ఎమోషనల్ టచ్‌తో సాగితే.. తమిళ ట్రైలర్ మాత్రం కార్తి అల్లరి మీదే నస్తూ.. ఫన్నీ మేనర్లో నడిచింది.