Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' సెట్స్ లో వేల తుపాకులు?

By:  Tupaki Desk   |   23 April 2022 8:11 AM GMT
యానిమ‌ల్ సెట్స్ లో వేల తుపాకులు?
X
ర‌ణ‌బీర్ క‌పూర్-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా సందీప్ వంగ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో 'యానిమ‌ల్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీమ్ షూటింగ్ కి రెడీ అవుతుంది. ఇప్ప‌టికే క్రూ అంతా షూటింగ్ స్పాట్ మ‌నాలీకి చేరుకున్నారు.

కొత్త పెళ్లి కొడుకు ర‌ణ‌బీర్ కూడా సెట్ కి చేరుకున్నారు. స్పాట్ నుంచి ఓ ఫోటోని కూడా లీక్ చేసి 'ఐయామ్ రెడీ' అని హింట్ ఇచ్చేసాడు. తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి ట్విట‌ర్ ద్వారా ఓ వీడియో వైర‌ల్ గా మారింది.

ఇందులో భారీగా ర‌క‌ర‌కాల తుపాకులు క‌నిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ కోసం ఎలాంటి మోడ‌ల్స్ తుపాకులు వాడుతున్నారో సందీప్ వంగ ఇలా రివీల్ చేసారు. దీన్నీ బ‌ట్టి మ‌నాలీ షెడ్యూల్ ఎంత వ‌యోలెంట్ గా ఉంటుందో క్లారిటీ వ‌స్తుంది. ఈ షెడ్యూల్ లో కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లు చాక్లెట్ బోయ్ గా ఉన్న ర‌ణ‌బీర్ క‌పూర్ ని ర‌క్త‌పాతం సృష్టించే హీరోగా మలుస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఈ రేంజ్ యాక్షన్ చిత్ర‌లో ర‌ణ‌బీర్ ఇప్ప‌టివ‌ర‌కూ న‌టించ‌లేదు. ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉన్న ర‌ణ‌బీర్ కి ఈ సినిమా ప్ర‌త్యేక‌మైన ఐడెంటీటిని తీసుకురావ‌డం ఖాయం. రాకీభాయ్ లాంటి ర‌ణ‌బీర్ ని సినిమాలో చూస్తామా? అంటూ సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 'కేజీఎఫ్' లో రాకీభాయ్ తుపాకులు ఏ రేంజ్ లో పేల్చుతాడో చూసాం. ఒకేసారి మూడు వంద‌ల బుల్లెట్లు గాల్లోకి పేల్చిన సీన్ సినిమాలో హైలైట్ .

ఇప్పుడీ గ‌న్స్ వీడియో చూస్తుంటే అదే స‌న్నివేశం క‌ళ్ల‌ముందు మొదులుతుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ త‌ర్వాత బాలీవుడ్ లో రెండ‌వ ప్రాజెక్ట్ గా 'యానిమ‌ల్' చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో అనీల్ క‌పూర్.. బాబి డియోల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సినీ వ‌న్ స్టూడియెస్ - భ‌ద్ర‌ఖాళీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.